Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ముందు నువ్వు మారు.. నిర్మాతల్ని కాల్చుకుతిన్న నువ్వా మాట్లాడేది..?

Advertiesment
ముందు నువ్వు మారు.. నిర్మాతల్ని కాల్చుకుతిన్న నువ్వా మాట్లాడేది..?
, శనివారం, 28 నవంబరు 2020 (10:33 IST)
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌పై మెగా బ్రదర్ నాగబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించిన ప్రకాష్ రాజ్‌పై మెగా బ్రదర్ విమర్శలు గుప్పించారు. పవన్ ఎవరికి ద్రోహం చేశాడని, ప్రతీ పనికిమాలిన వాడు విమర్శిస్తున్నాడని ఆగ్రం వ్యక్తం చేశారు. 
 
రాజకీయాల్లో నిర్ణయాలు అనేక సార్లు మారుతాయి. కానీ వాటి మార్పు వెనక ఉండే ఉద్దేశ్యం ఆ పార్టీకి ప్రజలకు దీర్ఘకాలం పాటు మంచి చేకూర్చేలా ఉండాలి. మా నాయకుడు పవన్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రజలకు అనేక ప్రయోజనాలు, పార్టీకి మేలు రెండు సాధ్యమవుతాయి. అందుకనే పవన్ ఇంతటి కృషి చేశాడు. 
 
బీజేపీ నేత సుబ్రహ్మణ్యం డిబేట్‌లో ప్రకాష్ రాజ్ రాజకీయ డొల్లతనం అర్థమైందని.. సుబ్రహ్మణ్యం ప్రశ్నలకు సమాదానం చెప్పలేక పడుతున్న ఆయన తడబడ్డారనే విషయం ఇంకా తనకు గుర్తుందని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే విమర్శించడంలో తప్పులేదు. అలాగే వారు ప్రజలకు ఉపయోగే పని చేసినప్పుడు హర్షించ గలగాలి. విమర్శించడం తప్ప మంచిని గుర్తించలేని నీకు సంస్కారం ఎలా నేర్పించగలుగుతాం. కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దేశానికి బీజేపీ, ఆంధ్రాకి జనసేన వంటి పార్టీలు ఉంటేనే అవి అభివృద్దిని చూడగలగుతాయి.
 
'నీలాంటి అతితెలివి పరులు ఎన్ని మాట్లాడినా బీజేపీ, జనసేన కూటమి శక్తిని అడ్డుకోలేరు. నువ్వు నీ పని సక్రమంగా నిర్వర్తించిన తరువాత పక్కవారి పనిలో వేలు పెట్టు. నువ్వు ఎంతమంది నిర్మాతల్ని డబ్బు కోసం హింసించింది.
 
ఇచ్చిన డేట్స్‌ని కాన్సల్ చేసింది అన్నీ తెలుసు. ముందు నువ్వు మారు. రాష్ట్ర మార్పు గురించి తరువాత మాట్లాడు. ఆ తరువాత మంచి మనిషి, నిశ్వార్థపరుడై పవన్‌ను విమర్శించు. డైరెక్టర్లని కాకా పట్టి, నిర్మాతలని కాల్చుకు తిన్న నీకు ఇంతకన్నా మంచిగా చెప్పలేను' అని నాగబాబు దుయ్యబట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేజ‌ర్ లుక్ టెస్ట్ వీడియో రిలీజ్ చేసిన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు