Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాబాయ్‌తో సినిమా చేస్తా- రామ్‌చ‌ర‌ణ్‌

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (12:47 IST)
Ram Charan
మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఆచార్య‌లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ త్వ‌ర‌లోనే అన్నీ అనుకూలిస్తే బాబాయ్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధంగా వున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆచార్య సినిమా గురించి ఆదివారంనాడు ఆయ‌న కొన్ని విష‌యాలు తెలియ‌జేశారు. 
 
- బాబాయ్‌తో సినిమా చేయాల‌నుంది.  ఇద్దరికి కూడా కుదరాలి. అయితే ఆయన ప్రొడ్యూసర్ గానే కాకుండా కో ప్రొడక్షన్ అయినా  చేస్తా. ఆయన కూడా ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్ ఒకే చేసేసారు. చాలా బిజీ చేసేసారు. వారికి నాలా కో ప్రొడ్యూసర్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము.
 
- ఆచార్య క‌థ కొర‌టాల చెప్పిన‌ప్పుడు ముందు నేను ఈ సినిమా లోకి నిర్మాతగా ఎంటర్ అయ్యాను తప్ప నటుడుగా కాదు. కానీ తర్వాత నటుడుగా కూడా తర్వాత ఉంటానని కొంచెం చిన్న పాత్ర ఉంటుంది అని చెప్పారు. కథకి ఇది చాలా ముఖ్యం అని తెలుసు. కానీ తర్వాత అది మరింత పెరిగింది.  నాన్న గారితో సినిమా అవ్వడంతో ఓకే చేసేసాను.
- ఈ పాత్ర‌కు నేను అయితే ముందు అనుకోలేదు. నేను అప్పటికే రాజమౌళి గారితో సినిమాలో ఉన్నాను. తర్వాత సినిమా పరిస్థితులు మారి నాన్న కొరటాల గారితో మాట్లాడి ఆయన ఆచార్య కి రావడం తర్వాత నేను ఎంటర్ అవ్వడం జరిగాయి.
- ఇందులో నాన్న గారిది నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటాయి. కానీ అంతిమంగా ధర్మం కోసమే నిలబడతారు. నేను గురుకులంలో కనిపించే అబ్బాయిలా కనిపిస్తాను. అలాగే నాన్న గారిది ఒక ఫైటర్ లా కనిపిస్తారు.  
- ఆర్‌.ఆర్‌.ఆర్‌. పాత్ర‌, ఇది వేరే పాత్ర‌. రెండు క‌ష్ట‌మైనా ఇష్టంగా చేశాను.  నా పాత్ర ఎలా వుండాల‌నేది ఆల్రెడీ పేపర్ మీదనే శివ గారు రాజమౌళి గారు రాసేశారు. వాటిని నేను బాగా ఇష్టంగా చేశాను సో నాకు అంత కష్టంగా కన్నా ఇస్టంగానే అనిపించాయి.
 
-  పాన్ ఇండియా స్థాయిలో ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా వ‌చ్చేసింది. ఆ స్థాయిలో ఆచార్య‌ను ప్ర‌మోట్ చేయాలంటే కాస్త టైం కావాలి. అందుకే చేయ‌లేక‌పోయాం.
 - పూజా హెగ్డే   బాగా యాక్ట్ చేస్తుంది. ముందే “రంగస్థలం”లో ఓ సాంగ్ చేసాం రేపు సినిమాలో మా కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పటికే మోస్ట్ బిజీ యాక్టర్స్ గా ఆమె ఉంది.
- బాలీవుడ్‌లో ఒక సినిమా చేశాను. కానీ ఇప్పుడు ఆ రూటులో ఆలోచించ‌లేదు.   ఏ డైరెక్టర్ తో అయినా కూడా పర్ఫెక్ట్ గా నాకు సెట్ చేసి తీసుకొస్తే నేను డెఫినెట్ గా ఓకే చేస్తాను. ఒక సినిమా తర్వాత ఈ తరహా సినిమానే చెయ్యాలి అనేవి పెట్టుకోను నేను అంతా వాళ్ళకి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. మనం కూడా బాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చెయ్యాలి వాళ్ళు మన హీరోలతో సినిమాలు చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను.
- పుష్ప , కెజి.ఎఫ్‌. సినిమాలు రావ‌డం నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇది వరకు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ సినిమా మాత్రమే అనడం అక్కడి హీరోస్ కోసమే చెప్పడం జరిగేది కానీ ఇప్పుడు మన సినిమాలు టోటల్ ఇండియా వైడ్ మంచి గుర్తింపు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments