ఆచార్య సినిమా నుంచి చందమామ కాజల్ అగర్వాల్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో మాస్ డైరక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 29న ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. మొదటి నుంచి ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ ప్రకటించారు. గతంలో విడుదలైన లాహే లాహే పాటలోనూ కాజల్ సిందులేస్తూ కనిపించింది.
అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లో కాజల్ ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. "ముందుగా సినిమా అనుకున్నప్పుడు హీరోకు జోడిగా హీరోయిన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ పాత్ర క్రియేట్ చేశాం.. కానీ
నక్సలిజం సిద్ధాంతం ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని.. హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి పాత్రను సృష్టించాం.
కానీ ఆ పాత్రకు లవ్ యాప్ట్ కాదంటూ మెగాస్టార్‍కు చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో కాజల్ పాత్ర తొలగించాం.. ఇదే విషయాన్ని కాజల్‌కు కూడా చెప్పాం.. తను కూడా ఒప్పుకుంది.. భవిష్యత్తులో సినిమా చేద్దాం అంది" అంటూ చెప్పుకొచ్చారు.