Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచార్య నుంచి చందమామను అందుకే తొలగించాం.. కొరటాల శివ

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (11:09 IST)
ఆచార్య సినిమా నుంచి చందమామ కాజల్ అగర్వాల్‌ను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో మాస్ డైరక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరక్టర్ కొరటాల శివ కాంబోలో ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కీలకపాత్రలలో నటిస్తున్నారు. 
 
ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా ఏప్రిల్ 29న ఘనంగా విడుదల కానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. మొదటి నుంచి ఈ సినిమాలో చిరు సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోందని మేకర్స్ ప్రకటించారు. గతంలో విడుదలైన లాహే లాహే పాటలోనూ కాజల్ సిందులేస్తూ కనిపించింది. 
 
అయితే ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‏లో కాజల్ ఎక్కడా కనిపించలేదు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ కొరటాల శివ. ఇటీవల ఓ ఛానల్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాజల్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
 
డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ.. "ముందుగా సినిమా అనుకున్నప్పుడు హీరోకు జోడిగా హీరోయిన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాం. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్ పాత్ర క్రియేట్ చేశాం.. కానీ 
 
నక్సలిజం సిద్ధాంతం ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని.. హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి పాత్రను సృష్టించాం. 
 
కానీ ఆ పాత్రకు లవ్ యాప్ట్ కాదంటూ మెగాస్టార్‍‌కు చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. దీంతో కాజల్ పాత్ర తొలగించాం.. ఇదే విషయాన్ని కాజల్‌కు కూడా చెప్పాం.. తను కూడా ఒప్పుకుంది.. భవిష్యత్తులో సినిమా చేద్దాం అంది" అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూరీలో రాష్ట్రపతి.. ప్రకృతిపై సుదీర్ఘ పోస్ట్.. సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు..?

పర్యావరణహితంగా వేడుకలు... ఉత్సవాలు చేసుకొంటే మేలు : ఉప ముఖ్యమంత్రి పవన్

ముంబైను ముంచెత్తిన కుంభవృష్టి... 6 గంటల్లో 300 మిమీ వర్షపాతం

హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో కొత్త బస్సు సర్వీసులు -ఏసీ బస్సులు కూడా..!

డ్రంక్ అండ్ డ్రైవ్.. వివాహితను ఢీకొట్టి... ప్రియురాలి ఇంట్లో నక్కిన నిందితుడు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పనస పండు ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments