Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడి పాత్రలో నటించేందుకు భయపడ్డా : హీరో ప్రభాస్ (video)

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2022 (10:48 IST)
తాను రాముడి పాత్రలో నటించేందుకు ఎంతో భయపడ్డానని హీరో ప్రభాస్ అన్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన మరో అద్భుతమైన దృశ్యకావ్యం "ఆదిపురుష్". ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం శ్రీరాముడు జన్మస్థలమైన అయోధ్యలో రిలీజ్ చేశారు. 
 
ఇందులో హీరో ప్రభాస్ మాట్లాడుతూ, "శ్రీరాముడి ఆశీస్సులు తీసుకునేందుకు ఇక్కడికి వచ్చాం. రాముడి పాత్రలో నటించేందుకు మొదట ఎంతో భయపడ్డా. ప్రాజెక్ట్‌ ఓకే అనుకున్నాక మూడు రోజుల తర్వాత ఓం రౌత్‌కు ఫోన్‌ చేసి.. ప్రేక్షకులకు చేరువయ్యేలా ఈ పాత్రలో ఎలా ఒదిగిపోవాలనే విషయంపై చర్చించాను. 
 
ప్రేమ, భక్తి, భయంతో దీన్ని తెరకెక్కించాం. అంకితభావం, క్రమశిక్షణ, విశ్వాసంతో ఉండటం.. ఈ మూడు విషయాలను శ్రీరాముడి నుంచి మనం నేర్చుకోవచ్చు. శతాబ్దాలుగా మనం ఈ లక్షణాలను అనుసరించాలని చూస్తున్నాం కానీ మన వల్ల కావడం లేదు. అందుకే మనం సామాన్య మనుషులమయ్యాం. శ్రీరాముడు దేవుడు అయ్యాడు. ఆ శ్రీరాముడి కృప మాపై ఉంటుందని విశ్వసిస్తున్నా" అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments