బాహుబలితో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న మూవీస్ అన్ని ప్యాన్ ఇండియా చిత్రాలే. ప్రస్తుతం ఆయన చేతిలో ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్- కె వంటి క్రేజీ మూవీస్ ఉన్నాయి. అందులో 'ఆది పురుష్'పై అభిమానుల అంచనాలు మామూలుగా లేవు.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా్కి ఓం రౌత్ దర్శత్వం వహించాడు. కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. 'ఆదిపురుష్' మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
కానీ, చిత్ర బృందం మాత్రం ఇప్పటి వరకు కూడా 'ఆదిపురుష్' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు. అభిమానులందరూ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు వారి ఎదురు చూపులకు తెర పడింది. తాజాగా ఆ మూవీలో రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రభాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.