Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌ను కొట్ట‌లేదు - అల్లూరి నిర్మాత బెక్కెం వేణుగోపాల్

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (17:31 IST)
Bekkem Venugopal
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్‌ 'అల్లూరి'. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రానికి నిర్మిస్తున్నారు. బెక్కెం బబిత సమర్పిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు నిజాయితీ గల పోలీసు అధికారి అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఈ అల్లూరి సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలౌతున్న నేపధ్యంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ విలేఖరుల సమావేశం నిర్వహించి సెప్టెంబర్ 3 నుండి అల్లూరి టీం యాత్రని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రెస్ మీట్ కి ఆయన పోలీస్ డ్రెస్ లో రావడం ఆకట్టుకుంది.
 
ఈ సందర్భంగా హీరోయిన్ గురించి బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. సెట్లో ఏమి జ‌రిగినా నిర్మాత‌కు క‌ష్ట‌మే. కొన్ని సార్లు కోపం వ‌స్తుంది. వాటినిఎలా సాల్వ్ చేసుకోవాల‌నేది టీమ్‌తో మాట్లాడి చేసుకుంటాం. అంతేకానీ కోపం వ‌స్తే దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం, కొట్ట‌డం అనేది జ‌ర‌గ‌లేదు. హీరోయిన్‌ను నేను కొట్ట‌లేద‌ని చెప్పారు. 
 
ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, లక్కీ మీడియా బ్యానర్ స్థాపించి 15 ఏళ్ళయ్యింది. మీ అందరి సహకారంతో విజయాలు సాధిస్తూ ముందుకు వచ్చాను. ఈ ప్రయాణంలో ఎక్కువ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కి ప్రాధన్యత ఇచ్చాను. మంచి కంటెంట్ తో యాక్షన్ సినిమా తీయాలని వుండేది. అలాంటి సమయంలో  ప్రదీప్ వర్మ 'అల్లూరి' కథ చెప్పారు. 'అల్లూరి' పేరు వింటేనే ఒక పవర్ వస్తుంది. అంతే పవర్ ఫుల్ స్టొరీ ఇది. ఎవరికైనా పోలీసు అవ్వాలని వుంటుంది. నేను చిన్నప్పుడు పోలీస్ అవ్వాలని అనుకున్నాను. 'అల్లూరి' సినిమా చాలా ఎమోషనల్ గా ఇష్టంగా చేశాను. సినిమాపై వున్న ప్రేమ గౌరవంతోనే మీముందుకు పోలీస్ డ్రెస్ తో వచ్చాను. 'అల్లూరి' షూటింగ్ నిన్నటితో పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్నాయి. సెప్టెంబర్ 23 సినిమా విడుదలౌతుందని ముందే ప్రకటించాం. రేపటి నుండి సినిమాకి సంబంధించిన పాటలు వరుసగా విడుదల చేసి పదిరోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం. సెప్టెంబర్ 3 నుండి వైజాగ్ లో అల్లూరి సీతారామారాజు గారి సమాధి దగ్గర నుండి హీరో గారితో పాటు సినిమా యూనిట్ అంతా కలసి యాత్రని ప్రారంభిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో టూర్ చేసి పోలీసులు అధికారులకు సన్మానం చేస్తూ పబ్లిక్ తో కలుస్తూ 12 రోజుల పాటు టూర్ ప్లాన్ చేశాం. వైజాగ్ లో మొదలైన టూర్ వరంగల్ నిజామాబాద్ వరకూ కొనసాగుతుంది. టూర్ ముగిసిన తర్వాత ప్రీరిలీజ్ ఈవెంట్ చేసి సినిమాని గ్రాండ్ విడుదల చేస్తాం. మేము నిర్మించిన ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతోనే శ్రీవిష్ణు నటుడిగా పరిచమయ్యారు. అంచెలంచలుగా ఎదిగి గొప్ప స్థాయికి చేరుకున్నాడు. 'అల్లూరి' సినిమాలో చాలా ఇంటెన్స్ గా చేశాడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో శ్రీవిష్ణు విశ్వరూపం చూస్తారు. శ్రీవిష్ణు కెరీర్ లో అల్లూరి బెస్ట్ మూవీ అవుతుంది.  దర్శకుడు ప్రదీప్ వర్మ చాలా గొప్పగా తీశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మిగతా సాంకేతిక నిపుణులంతా అద్భుతంగా పని చేశారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు'' తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments