Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ‌లం తెచ్చుకుని వ‌చ్చా, గుణ శేఖ‌ర్‌ పాదాల‌పై ప‌డ్డా : స‌మంత

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (09:52 IST)
Samantha
తన ఆరోగ్య పరిస్థితి మైయోసైటిస్ కారణంగా పెద్దగా అడుగులు వేయని మంథా, సోమవారం హైదరాబాద్‌లో దేవ్ మోహన్ (మలయాళం) ఫేమ్‌తో కలిసి ఆమె నటించిన శాకుంతలం ట్రైలర్ లాంచ్‌కు మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా  స‌మంత మాట్లాడుతూ ‘‘ఈ క్ష‌ణం కోస‌మే నేను, మా శాకుంత‌లం టీమ్ ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా ఇక్క‌డ‌కు రావాల‌ని ఫిక్స్ అయిపోయి బ‌లం తెచ్చుకుని వ‌చ్చాను. గుణ శేఖ‌ర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వ‌ల్ల వ‌చ్చాను. ఆయ‌న‌కు సినిమానే జీవితం. ప్ర‌తి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. నెరేష‌న్ విన్న‌ప్పుడూ యాక్ట‌ర్స్ అంద‌రూ సినిమా అలాగే రావాల‌ని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్ర‌మే మా ఊహ‌ను దాటి ఎక్స్‌ట్రా మ్యాజిక్ జ‌రుగుతుంది. సినిమా చూసిన త‌ర్వాత నేను చూసిన త‌ర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది. చూడ‌గానే గుణ శేఖ‌ర్‌గారి పాదాల‌పై ప‌డి థాంక్యూ చెప్పాను. దిల్ రాజుగారికి థాంక్యూ. 
 
శాకుంత‌లం అనే మ్యాజిక‌ల్ వరల్డ్‌ను క్రియేట్ చేయాలంటే ఏ లిమిట్‌, క్యాలిక్యులేష‌న్స్ లేకుండా న‌మ్మ‌కంతో చేయాలి. అలాంటి ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్‌ని దిల్‌రాజుగారి రూపంలో చూశాను. మంచి సినిమా తీయాల‌నే ఆయ‌న చూస్తారు. ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులున్నారు. 
 
నేను సెట్స్‌లోకి రెడీ అయ్యి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డున్న అమ్మాయిల రియాక్ష‌న్ చూసి ప‌ర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడ‌ని ఫిక్స్ అయ్యాను. కాళిదాసుగారు 5వ శ‌తాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగాచేస్తోన్న శాకుంత‌లం సినిమా కోసం న‌న్ను గుణ శేఖర్‌గారు ఎంపిక చేయ‌టం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాను. అయితే మారన‌ది ఒక‌టే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా న‌న్ను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యం. శాకుంత‌లంతో ఈ ప్రేమ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments