Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

ఠాగూర్
గురువారం, 24 ఏప్రియల్ 2025 (13:20 IST)
కాశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని యావత్ భారతదేశమే కాదు పలు ప్రపంచ దేశాలు ఖండించాయి. కానీ, దాయాది దేశమైన పాకిస్థాన్ మాత్రం ఈ దాడిపై ఇంతవరకు నోరు మెదపలేదు. ఈ దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌తో సంబంధాలపై  భారత ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. అదేసమయంలో పాకిస్థాన్ నటీనటులు భారతీయ చిత్రాల్లో నటించడానికి వీల్లేదంటూ నెట్టింట షేర్ చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్వీ ఎస్మాయిల్‌ పేరు ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చారు. 
 
తాను పాకిస్థానీ నటిని కాదని స్పష్టం చేస్తూ ఓ సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఉగ్రదాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. "నాకు, నా కుటుంబానికి సంబంధించిన కొన్ని తప్పుడు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నేను పాకిస్థానీని కాదు. నాకు, నా కుటుంబంలోని ఎవరికీ ఆ దేశంతో సంబంధాలు లేవు. ద్వేషాన్ని కలిగించాలనే ఏకైక ఉద్దేశంతో ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. కొన్ని పేరున్న వార్తా సంస్థలు కూడా నా విషయంలో కనీస పరిశోధనలు చేయకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. ఇది బాధాకరం" అంటూ పేర్కొన్నారు. 
 
ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!
 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ముందు ఇపుడు పెద్ద సమస్య వచ్చిపడింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్‌గా పాకిస్థాన్ మూలాలు ఉన్న ఇమాన్విని ఎంపిక చేశారు. ఇదే ఇపుడు సమస్యకు ప్రధాన కారణంగా నిలిచింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామాలో ఉగ్రవాదులు పాశవికదాడికి పాల్పడి 25 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
పాక్‌పై భారత్ కూడా దౌత్య యుద్ధానికి తెరలేపింది. పాకిస్థాన్‌ను తాగు, సాగునీటిని సరఫరా చేసే సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. వాఘా, అట్టారీ సరిహద్దులను మూసివేసింది. అలాగే, భారత్‌లోని పాకిస్థాన్ పౌరులు 48 గంటలు లేదా మే ఒకటో తేదీలోపు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిణామాలన్నీ ప్రభాస్ సినిమాలోని హీరోయిన్ ఇమాన్వికి ప్రతికూలంగా మారాయి. దీంతో ఆమెను సినిమా నుంచి తొలగించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇమాన్వి నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. 
 
ఇమాన్వికి పాకిస్థాన్ మూలాలు ఉన్నాయని, ఆమె తండ్రి పాకిస్థాన్ సైన్యంలో గతంలో మేజర్‌గా పని చేసి ఆ తర్వాత ఆమెరికాలో స్థరపడ్డారంటూ ప్రచారం సాగుతోంది. ఈ సమాచారం ఆధారంగా, పాకిస్థాన్ మూలాలు ఉన్న వ్యక్తిని తమ అభిమాన హీరో సినిమాలో హీరోయిన్‌గా వద్దంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. పహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో తెరపైకి వచ్చిన ఈ డిమాండ్లకు ఇపుడు ప్రాధాన్యత చేకూరింది. ఇది ప్రభాస్‌కు కూడా ప్రతికూలంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

నడి రోడ్డుపై ఘోరంగా తన్నుకున్న ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి (Video)

రూ.లక్ష డిమాండ్ చేసిన విద్యుత్ శాఖ ఎస్ఈ .. రూ.80 వేలు తీసుకుంటూ చిక్కాడు...

కన్నబిడ్డ ప్రేమను అడ్డుకున్న తండ్రి.. ప్రియుడుతో కలిసి కొట్టి చంపేసిన తల్లీ కూతుళ్లు

ప్రియుడితో పట్టుబడిన భార్య ... కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments