Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏ వైలెంట్ టేల్ అఫ్ బ్లడ్ షెడ్: హనీ రోజ్ రేచెల్ రాబోతుంది

డీవీ
మంగళవారం, 18 జూన్ 2024 (16:09 IST)
Honey Rose
హనీ రోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న 'రేచెల్' టీజర్ విడుదలైంది. వైలెన్స్, బ్లడ్ షెడ్ తో కూడిన కథగా ఈ చిత్రం ఉంటుందని టీజర్‌ హిట్ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు అబ్రిడ్ షైన్ సహ నిర్మాతగా ,  సహ రచయితగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకురాలు ఆనందిని బాలా దర్శకత్వం వహించారు. యాక్టింగ్ ఫీల్డ్ లో హనీ రోజ్‌కి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ సినిమా ఉపయోగించుకోనుందని ఈ టీజర్‌ చూస్తే అర్ధమౌతోంది.
 
ఈ చిత్రంలో బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టిల్, జోజి, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్ వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని బాదుషా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాదుషా ఎన్‌ఎమ్, రాజన్ చిరాయిల్, అబ్రిడ్ షైన్ నిర్మించారు. రాహుల్ మణప్పట్టు కథను అందించగా, స్క్రీన్ ప్లే రాహుల్ మణప్పట్టు, అబ్రిడ్ షైన్ అందించారు.
 
తారాగణం: హనీ రోజ్, బాబు రాజ్, కళాభవన్ షాజోన్, రోషన్ బషీర్, చందు సలీంకుమార్, రాధిక రాధాకృష్ణన్, జాఫర్ ఇడుక్కి, వినీత్ తట్టి, జోజీ, దినేష్ ప్రభాకర్, పౌలీ వల్సన్, వందిత మనోహరన్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments