Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభిమానానికి నేనెంతో లక్కీ అన్న హనీ రోజ్

Shopping Mall, Honey Rose
, గురువారం, 10 ఆగస్టు 2023 (17:07 IST)
Shopping Mall, Honey Rose
ప్రముఖ హీరోయిన్.. బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలో కీలక పాత్రలో నటించిన హనీ రోజ్ వర్గీస్.. ప్రకాశం జిల్లా మార్కాపురం వచ్చారు. మార్కాపురం పట్టణంలోనే అతి పెద్ద షోరూం అయిన లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు నటి హనీ రోజ్. తెలుగు నేలపై ఇంత మంది తనపై చూపిస్తున్న అభిమానానికి నేనెంతో లక్కీ అన్నారు హీరోయిన్ హనీ రోజ్. ఎన్నో సంవత్సరాలుగా ఫ్రంట్ లైన్ ఫ్యాషన్ అనుభవంతో.. మార్కాపురంలో 9వ స్టోర్ ను.. జ్యోతి ప్రజ్వలనతో శుభారంభం చేశారు నటి హనీరోజ్. నాలుగు అంతస్తుల్లో ఏర్పాటైన లక్కీ షాపింగ్ మాల్ లో పిల్లలు, మహిళలు, పురుషులు ఇలా కుటుంబానికి అవసరం అయిన అన్ని రకాల ఫ్యాషన్ వస్త్రాలను పరిశీలించారు.

మహిళలు, పిల్లల కోసం సంప్రదాయ దుస్తులతోపాటు.. లేటెస్ట్ ట్రెండ్ కు అనుగుణంగా అన్ని రకాల మోడ్రన్ డిజైన్ దుస్తులు ఒకే చోట లభించే ఏకైక ఫ్యామిలి షాపింగ్ మాల్.. లక్కీ షాపింగ్ మాల్ అన్నారు సినీ నటి హనీ రోజ్. ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య​అతిధిగా హాజరైన హనీరోజ్.. నాలుగు అంతస్తుల్లోని అన్ని కౌంటర్ల దగ్గరకు వెళ్లి చీరలు, డ్రస్సులు చూశారు. 
 
మంత్రి ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబులతో కలిసి లక్కీ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు ప్రముఖ నటి హనీరోజ్. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొమ్మిదో షాపింగ్ మాల్ ను మార్కాపుంలో ఏర్పాటు చేయటం అభినందనీయం అన్నారు. నాణ్యతతో కూడిన వస్త్రాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావటం మంచి పరిణామం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో అందించాలని నిర్వహకులను కోరారు ప్రజాప్రతినిధులు. 
 
ఈ కార్యక్రమంలో లక్కీ షాపింగ్ మాల్ నిర్వహకులు ఎస్.రత్తయ్య, జి.శ్రీనివాసరావు, ఎస్.స్వామి, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, లక్ష్మీచెన్నకేశవస్వామి దేవస్థానం చైర్మన్ కేశవరావు, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాసరావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మార్కాపురం వచ్చిన హీరోయిన్ హనీరోజ్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, నగరవాసులు తరలి వచ్చారు. అభిమానులతో మార్కాపురం పట్టణం కళకళలాడింది. అభిమానులు అందరికీ అభివాదం చేస్తూ.. ఉర్రూతలూగించారు. సెల్పీలతో సందడి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతా కళ్యాణ వైభోగమే చివరి షెడ్యూల్ ప్రారంభం