Webdunia - Bharat's app for daily news and videos

Install App

గద్దలకొండ గణేష్ పొమ్మన్నాడు.. హిమజ ఇంటి నుంచి అవుట్

Webdunia
సోమవారం, 23 సెప్టెంబరు 2019 (09:55 IST)
బిగ్ బాస్ మూడో సీజన్‌లో భాగంగా హిమజ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది. అతి తక్కువ ఓట్లు రావడంతో హిమజ బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. స్టార్ మా వారి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ నుంచి ఆదివారం నటి హిమజ ఎలిమినేట్ అయింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో రాహుల్ ఎలిమినేట్ అయినట్టు చూపించి అందరికీ షాకిచ్చిన బిగ్‌బాస్.. ఆపై హిమజను ట్విస్ట్ ఇచ్చి బయటికి పంపారు. 
 
ఈ వారం నామినేషన్లలో రాహుల్, హిమజ, మహేష్ విట్టాలు ఉండగా హిమజ ఎలిమినేట్ అయినట్టు ‘గద్దలకొండ గణేశ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం షోకు వచ్చిన నటుడు వరుణ్ తేజ్ ప్రకటించాడు.  
 
నిజానికి నామినేషన్లలో తొలుత హిమజ పేరు లేదు. హిమజ నామినేట్ కాకుండా ఉండాలంటే వరుణ్ పేడ తొట్టెలో పడుకోవాలని బిగ్‌బాస్ షరతు విధించాడు. అందుకు వరుణ్ ఓకే అనడంతో హిమజ నామినేషన్ నుంచి బయటపడింది. అయితే, హౌస్ కెప్టెన్ అయిన వితిక తనకున్న ప్రత్యేక అధికారంతో హిమజను నామినేట్ చేసింది. 
 
ఈ వారం హిమజ, రాహుల్ సిప్లిగంజ్, మహేశ్ విట్టాలు నామినేట్ కాగా, అత్యంత తక్కువ ఓట్లు రావడంతో హిమజ హౌస్‌ను వీడాల్సి వచ్చింది. కాగా, ఫేక్ ఎలిమినేషన్‌తో బయటకు వెళ్లి తిరిగి హౌస్‌లోకి వచ్చిన రాహుల్.. ప్రస్తుతం సీక్రెట్ రూములోనే ఉన్నాడు. 
 
రెండు వారాల తర్వాత మళ్లీ రాహుల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగు పెడతాడు. రాహుల్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కావడంతో పునర్నవికి పెద్ద షాక్ తప్పలేదు  అతను సీక్రెట్ రూమ్‌లో వుండటంతో పున్ను చాలా నిరాశ చెందింది. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌లో గద్దలకొండ గణేష్ సందడి చేశాడు. వరుణ్ తేజ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌజ్ కళకళలాడింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments