Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో పెళ్లి చేసుకోనున్న హీరో సుమంత్

Webdunia
బుధవారం, 28 జులై 2021 (12:49 IST)
టాలీవుడ్ హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకోనున్నారు. దీంతో అక్కినేని ఫ్యామిలీలో శుభకార్యం జరగనుంది. వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న సుమంత్‌ త్వరలోనే మరో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
తన కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన పవిత్ర అనే అమ్మాయి మెడలో ఆయన మూడుముళ్లు వేయనున్నారు. ఇరు కుటుంబపెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. ఈ మేరకు సుమంత్‌‌-పవిత్రలకు సంబంధించిన ఓ పెళ్లిపత్రిక నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. 
 
మరోవైపు సుమంత్‌కు హీరోయిన్‌ కీర్తిరెడ్డితో గతంలోనే వివాహమైన విషయం తెలిసిందే. మనస్పర్థలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో వీరివురూ విడాకులు తీసుకుని తమ బంధానికి స్వస్తి పలికారు.
 
‘ప్రేమకథ’తో వెండితెరకు పరిచయమైన సుమంత్‌ .. ‘స్నేహమంటే ఇదేరా’, ‘సత్యం’, ‘గోదావరి’, ‘గోల్కోండ హైస్కూల్‌’ చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వరుస పరాజయాల అనంతరం ‘మళ్లీరావా’ సినిమాతో సుమంత్‌ పాజిటివ్‌ టాక్‌ అందుకున్నారు. 
 
ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన ‘కపటధారి’ మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘అనగనగా ఒక రౌడీ’లో నటిస్తున్నారు. నిజానికి తన తొలి వివాహమైన తర్వాత ఆయన మరో పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తూ వచ్చారు. కానీ, ఇపుడు రెండో పెళ్లికి సమ్మతించడంతో అక్కినేని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments