Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోటీ ఉన్నా సినిమా బాగుందంటే కచ్చితంగా చూస్తారు హీరో దినేష్ తేజ్

Webdunia
గురువారం, 9 నవంబరు 2023 (16:34 IST)
Hero Dinesh Tej
దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణలు  హీరో హీరోయిన్లుగా రాబోతున్న  ఓ మంచి ఫీల్ గుడ్ మూవీ ‘అలా నిన్ను చేరి’. ఈ మూవీని విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. అన్ని రకాల అంశాలను జోడించి ఈ మూవీని మారేష్ శివన్ తెరకెక్కించగా కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మించారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ పాటలు రాయగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. చిత్రం నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ క్రమంలో హీరో దినేష్ తేజ్ మీడియాతో ముచ్చటించారు.
 
- అలా నిన్ను చేరి అంటూ కొత్తగా ప్రయత్నించాను. కమర్షియల్ ‌రోల్‌ను పోషించాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ప్రతీ ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎదురయ్యే సంఘర్షణే ఇందులో ఉంటుంది. ప్రేమ ముఖ్యమా? లక్ష్యం ముఖ్యమా? అన్నది చూపిస్తాం. ఆ పాయింటే నాకు ఈ సినిమా చేయడానికి స్పూర్తిని ఇచ్చింది.
 
- కరోనా టైంలో వచ్చిన ప్లే బ్యాక్ వల్ల మంచి పేరు వచ్చింది. మంచి రివ్యూలు వచ్చాయి. నాకు మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తరువాత ఓ చిత్రం థియేటర్లోకి వచ్చింది కానీ అంతగా మెప్పించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రంతో ఎలాంటి ప్రశంసలు వస్తాయో చూడాలి.
 
- హెబ్బా పటేల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆమె అద్భుతంగా నటించారు. సెట్‌లో ఆమె ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవారు. పాయల్‌ నటన గురించి ఇప్పుడు ప్రేక్షకులు తెలుసుకుంటారు. మా ముగ్గురి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
 
- చంద్రబోస్ గారు రాసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. మా సినిమాకు పాటలు రాస్తున్న టైంలోనే ఆయనకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది.
 
- డైరెక్టర్ మారేష్ శివన్ హుషారు సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ మూవీ అయిన ఏడాదికి నా వద్దకు వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. కథ నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి వెంటనే ఓకే చెప్పాను.
 
- జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ వస్తున్నాయని మాకు తెలియదు. అయినా సినిమా బాగుందంటే ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. మంచి చిత్రాన్ని చూశామనే ఫీలింగ్‌తో బయటకు వస్తారు. ఈ చిత్రంలో హెబ్బా పాత్రతోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎయిర్ షో కోసం ముస్తాబైన చెన్నై.. మెరీనాలో కనువిందు

భర్తతో విడిగా వుంటున్న స్నేహితురాలిపై కన్ను, అందుకు అంగీకరించలేదని హత్య

రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన టీటీడీ

33 నైజీరియా రాష్ట్రాల్లో కలరా వ్యాప్తి.. 359మంది మృతి

అమలతో మాట్లాడిన ప్రియాంకా గాంధీ, కొండా సురేఖ రాజీనామా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments