Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రిష్ అభినందనలు అందుకున్న అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ (వీడియో)

Advertiesment
Director Krish, Aala Ninnu Cheri team
, బుధవారం, 6 సెప్టెంబరు 2023 (16:15 IST)
Director Krish, Aala Ninnu Cheri team
నేటితరం నచ్చే, మెచ్చే కంటెంట్ తీసుకొని ఎన్నో జాగ్రత్తలతో 'అలా నిన్ను చేరి' సినిమా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాతో ఆడియన్స్ లో ఓ డిఫరెంట్ అనుభూతి తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు మేకర్స్. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దినేష్‌ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతుండగా..  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాను జనానికి చేరువ చేసే దిశగా బెస్ట్ ప్రమోషన్స్ చేపడుతున్నారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకున్నాయి. అదే బూస్టింగ్ తో ఇప్పుడు అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ లాంచ్ చేశారు. ఫేమస్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా తాజాగా ఈ సాంగ్ విడుదల చేయబడింది. 
 
ఈ సాంగ్ రిలీజ్ చేసిన అనంతరం చిత్ర యూనిట్ మొత్తాన్ని క్రిష్ అభినందించారు. ఈ సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఆడియన్స్ టేస్ట్‌కి తగ్గట్టు అద్భుతమైన విజువల్స్ లో షూట్ చేసిన ఈ పాటకు మంచి స్పందన వస్తుందని అన్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు డైరెక్టర్ క్రిష్. 
 
ఈ పాటకు ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. సుభాష్‌ ఆనంద్ బాణీలు కట్టారు. ఎంతో ఆహ్లాదకరమైన లొకేషన్స్ లో షూట్ చేసిన ఈ సాంగ్ విజువల్స్ ఆడియన్స్ మనసు దోచుకుంటున్నాయి. హీరో హీరోయిన్ దినేష్ తేజ్, పాయల్ రాధాకృష్ణ అద్భుతమైన కెమిస్ట్రీ ఈ పాటకు మేజర్ అట్రాక్షన్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పాటలో సుభాష్‌ ఆనంద్ బాణీలు ఎంతో మనోహరంగా ఉన్నాయి. మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే ఎంతో వినసొంపుగా, విజువల్ ట్రీట్‌గా ఈ పాట ఆకట్టుకుంటోంది.
 
కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలా నిన్ను చేరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అతిత్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మేకర్స్ తెలిపారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

1980 బ్యాక్ డ్రాప్ లో రాజ్ తరుణ్ , సందీప్ మాధవ్ హీరోలుగా మాస్ మహారాజు