Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగ్లీ పాటకు మందు కొట్టి చిందులేసిన హెబ్బా పటేల్

Hebba Patel, Dinesh Tej
, గురువారం, 28 సెప్టెంబరు 2023 (17:06 IST)
Hebba Patel, Dinesh Tej
హీరో దినేష్ తేజ్, అందాల తార హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం 'అలా నిన్ను చేరి'. ఈ సినిమాతో ఆడియన్స్‌కు కొత్త అనుభూతిని ఇవ్వాలని మేకర్లు ప్రయత్నిస్తున్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీతో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి  కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
 
సినిమాను త్వరలోనే విడుదల చేయబోతున్న క్రమంలో ప్రమోషన్స్ పెంచింది చిత్రయూనిట్.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్,మోషన్ పోస్టర్, గ్లింప్స్‌, హీరో బర్త్ డే స్పెషల్ పోస్టర్‌‌లకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రిలీజ్ చేసిన అలా నిన్ను చేరి టైటిల్ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.
 
తాజాగా ఈ మూవీ నుంచి మంచి మాస్ బీట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిలీజ్ చేశారు. కోడిపాయే లచ్చమ్మది అంటూ మంగ్లీ పాడిన ఈ పాట కుర్రకారుని కట్టిపడేసేలా ఉంది. తెలంగాణ నుంచి మరో జానపదం చార్ట్ బస్టర్‌‌గా నిలవబోతోంది. మంగ్లీ గాత్రం, సుభాష్ ఆనంద్ బాణీలు, భాను కొరియోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయి. ఈ లిరికల్ వీడియోలో హెబ్బా పటేల్ అందాలు, నటన, డ్యాన్స్ అంతా కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
 
కుటుంబ సమేతంగా చూడదగ్గ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అలా నిన్ను చేరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని పాటలు కూడా ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయడం విశేషం. చిత్రానికి సుభాష్‌ ఆనంద్ సంగీతం అందించగా.. ఐ ఆండ్రూ కెమెరామెన్‌గా, కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా పని చేశారు. ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివకుమార్ రామచంద్రవరపు, శత్రు, కల్పలత, ‘రంగస్థలం’ మహేష్, ఝాన్సీ, కేదర్ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదిని దర్శక నిర్మాతలు ప్రకటించనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యానిమల్ లో తండ్రీ కొడుకులుగా అనిల్ కపూర్, రణబీర్ కపూర్