Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అధునాతన టెక్నాలజీతో అల్లు అర్జున్ AAA సినిమాస్

Allu arjun, ashina sunil and others
, శుక్రవారం, 16 జూన్ 2023 (17:54 IST)
Allu arjun, ashina sunil and others
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్, అమీర్ పేట్ లోని 'AAA సినిమాస్' ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో అల్లు అర్జున్ 'AAA సినిమాస్' ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన లాంచింగ్ ఈవెంట్ లో నిర్మాత అల్లు అరవింద్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా తమ అభిమాన హీరో అల్లు అర్జున్ ని చూడటానికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.
 
సునీల్ నారంగ్ మాట్లాడుతూ..''AAA సినిమాస్ కి అందరికీ స్వాగతం. ఈ కాంప్లెక్స్ మొత్తం మూడు లక్షల చదరపు అడుగులు. థర్డ్ ఫ్లోర్ లో35 వేల చదరపు అడుగులు ఫుడ్ కోర్ట్ వుంది. నాలుగో ఫ్లోర్ AAA సినిమాస్ ఐదు స్క్రీన్ లు వున్నాయి. స్క్రీన్ నెంబర్ 2 లో ఎల్ఈడీ స్క్రీన్ వుంది. సౌత్ ఇండియాలో ఎల్ఈడీ స్క్రీన్ వున్నది AAA సినిమాస్ లోనే. దీనికి ప్రోజక్షన్ వుండదు. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అద్భుతమైన అనుభూతి ఇస్తుంది. స్క్రీన్ 1లో  హైదరాబాద్ లోనే బిగ్గర్ స్క్రీన్ వున్న మల్టీఫ్లెక్స్ వుంది. 64 ఫీట్ విడ్త్ వుంది. అద్భుతమైన సౌండ్ క్యాలిటీ వుంటుంది. లాబీని చాలా లావిష్ గా డిజైన్ చేశారు. ప్రేక్షకులకు ఇది ఒక మంచి అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నాను'' అన్నారు
 
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. AAA సినిమాస్ ని వరల్డ్ క్లాస్ ఫీచర్స్ నిర్మించడం జరిగింది. సునీల్ నారంగ్ వాళ్ళు అధునాతన టెక్నాలజీతో దీనిని రూపొందించారు. సౌత్ ఇండియాలో  ఎల్ఈడీ స్క్రీన్ AAA సినిమాస్ లో వుండటం విశేషం. సునీల్ నారంగ్  టీమ్ వర్క్ తో AAA సినిమాస్ ని  చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేశారు. ప్రేక్షకులకు ఇది గొప్ప అనుభూతిని ఇస్తుంది'' అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ నెల 23న విడుద‌ల‌వుతోన్న కుట్ర‌ ద గేమ్‌ స్టార్స్‌ నవ్‌