నందమూరి తారకరత్న అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం 4గంటల 5 నిముషాలకు ముగిశాయి. ఉదయం 8గంటలనుంచి ఫిలింఛాంబర్‌లో వున్న తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించడానికి కుటుంబసభ్యులు అందరూ తరలివచ్చారు. అటు తెలంగాణ ప్రభుత్వం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలు పార్టీల నాయకులు వచ్చి నివాళులర్పించారు. వై.ఎస్. జగన్ పార్టీకి చెందిన విజయ్ సాయిరెడ్డి వెన్నంటి ఉండి మహాప్రస్తానంలో కార్యక్రమాలు అయ్యేవరకు వున్నారు. ఆయన బంధువునే తారకరత్న పెండ్లి చేసుకున్నాడు.
కుమారుడికి అంతిమ సంస్కారాలను తండ్రి మోహనకృష్ణ పూర్తి చేశారు. తారకరత్న పాడే మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు. తారకరత్న వెంటే వైకుంఠ రథంలో మహాప్రస్థానానికి వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబునాయుడు. మహాప్రస్థానంలో అంత్యక్రియలకు హాజరైన చంద్రబాబునాయుడు, విజయసాయిరెడ్డి, లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్. ఇక తారకరత్న అంతిమయాత్రలో అభిమానూలు, తెదేపా కార్యకర్తలు వేల సంఖ్యలో పాల్గొన్నారు.