అల వైకుంఠపురంలో.. మలయాళ ఫ్యాన్స్ హంగామా.. ఆ రెండు పాటలూ..?

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (14:08 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ''అల వైకుంఠపురములో".

ఈ నేపథ్యంలో బన్నీ సినిమాలకు మలయాళంలోనూ మంచి డిమాండ్ ఉంటుంది.. అలా వైకుంఠపురములో చిత్రాన్ని మలయాళంలో విడుదల చేస్తున్నారు. మలయాళ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిర్మాతలు. "అంగ వైకుంఠపురత్తు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 
 
తాజా పోస్టర్లో బన్నీ లుక్ బాగుంది. ఇక సామజనవరగమన మలయాళ సాంగ్‌ను నవంబర్ 10న విడుదల చేయనున్నారు. అలాగే ఇలా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో లేదో కేరళలో బన్నీ ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేశారు. ఫస్ట్ లుక్ ఫ్లెక్సీలతో సందడి చేస్తున్నారు.

త్వరలో మలయాళ వెర్షన్ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ కలిసి నిర్మిస్తున్న ''అల వైకుంఠపురములో'' సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న భారీగా రిలీజ్ కానుంది.
 
ఇక తెలుగులో ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు యూట్యూబ్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ రెండు పాటలు కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ దాటడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

iBomma రవి కేసు, బ్యాంక్ సహకారంతో రూ. 20 కోట్లు లావాదేవీలు

ముఖ్యమంత్రి మార్పుపై నాన్చుడి ధోరణి వద్దు : హైకమాండ్‌కు సిద్ధూ సూచన

హోం వర్క్ చేయలేదనీ చెట్టుకు వేలాడదీసిన టీచర్లు

నకిలీ మద్యం కేసులో జోగి రమేష్‌కు రిమాండ్ పొడగింపు

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments