Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దుమ్మురేపుతున్న 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో...' సాంగ్ (Video)

Advertiesment
దుమ్మురేపుతున్న 'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో...' సాంగ్ (Video)
, శనివారం, 26 అక్టోబరు 2019 (19:21 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో..., సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను పూర్తిగా విడుదల చేశారు. 
 
'రాములో రాములా నన్ను ఆగం జేసిందిరో .. రాములో రాములా నా పాణం దీసిందిరో' అంటూ ఈ పాట సాగుతోంది. క్లాస్ సెట్లో మాస్ బీట్‌లో సాగే ఈ పాటను బన్నీ .. పూజా హెగ్డే బృందంపై చిత్రీకరించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, మంగళి అద్భుతంగా ఆలపించారు. 
 
ఎస్. థమన్ సంగీత బాణీలు సమకూర్చారు. మాస్ ప్రేక్షకులకు ఈ పాట ఊపును .. ఉత్సాహాన్ని తెచ్చేదిలా వుంది. కొరియోగ్రఫీ కూడా సూపర్బ్‌గా ఉంది. ఈ చిత్రంలో విభిన్న లుక్‌లో బన్నీ కనిపిస్తున్నాడు. ఈ పాటను ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది వీక్షించారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్శబ్ధంతో నిశ్శబ్ధమైపోయిన స్వీటీ..