Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిస్కోరాజా ఫ‌స్ట్ సాంగ్ రిలీజ్... ఇంత‌కీ ఎలా ఉంది..?

Advertiesment
Disco Raja
మాస్ మహారాజా రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా సినిమా డిస్కో రాజా. రజిని తాళ్లూరి నిర్మాతగా వ్యహరిస్తున్న ఈ సినిమాకు యువ సంగీత దర్శకుడు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టడం జరిగింది. 
 
ఇకపోతే ఈ సినిమాలోని ‘నువ్వు నాతో ఏమన్నవో’ అనే పల్లవితో సాగె ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. తమన్ స్వరపరిచిన మెలోడియస్ ట్యూన్‌కి, గాన చక్రవర్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మధురమైన గాత్రంతో ఈ పాటను ఎంతో హృద్యంగా ఆలపించడం జరిగింది. 
 
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన అందమైన సాహిత్యం, ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ మంచి వ్యూస్‌తో దూసుకుపతోంది. రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి డిసెంబర్ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబ్బే, నేనందుకు పనికిరానేమో, నేనలా మారిపోతానంటున్న ఆది