Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ‌న్నీ రాములో రాములా పాట ఎలా ఉంది..? (video)

Advertiesment
బ‌న్నీ రాములో రాములా పాట ఎలా ఉంది..? (video)
, బుధవారం, 23 అక్టోబరు 2019 (16:48 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రూపొందుతోన్న భారీ చిత్రం అల‌.. వైకుంఠ‌పుర‌ములో. ఈ సినిమాలోని రాములో రాములా... అంటూ మంచి ఊపునిచ్చే బీట్‌తో బన్నీ వచ్చేశారు. ఇలా విన్నామో లేదో అలా న‌చ్చేసింది. అభిమానుల‌ను ఈ సాంగ్ టీజర్ విశేషంగా ఆక‌ట్టుకుంటుంది. టీజర్ వింటుంటేనే మంచి కిక్ వస్తోంది. 
 
ఇక ఈ నెల 26న పూర్తి పాట విడుద‌ల కానుంది. సామజవరగమన... సాంగ్ తో  ఇప్పటికే విడుదల చేశారు. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాటకి బ్ర‌హ్మాండ‌మైన స్పంద‌న ల‌భించింది.  మాస్ నంబర్ రాములో రాములా... పాట‌లో బన్నీ ఎల్లో బ్లేజర్‌లో మెరిసిపోతున్నారు. పూజా బ్లాక్ డ్రెస్‌లో అందంగా ఉంది. మ‌రో విశేషం ఏంటంటే.. ఈ పాట‌లో చాలా మంది గుర్తించ‌లేదు కానీ.. సుశాంత్ కూడా ఉన్నాడు. 
 
బ‌న్నీతో క‌లిసి డ్యాన్స్ చేసాడు. అనురాగ్ కులకర్ణి, మంగ్లి ఆలపించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించారు. ఈ సినిమాలో సీనియర్ నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుశాంత్, నివేత పేతురాజ్, నవదీప్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, రావు రమేష్, మురళీ శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల చేయ‌నున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప‌వ‌న్‌‍కి ఆ మూవీ ట్రైల‌ర్ న‌చ్చిందా..?