బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఇటీవలే పెళ్లాడిన బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుందని.. ఇందులో భాగంగానే ఆమెను ముంబైలోని ఆస్పత్రికి త
బాలీవుడ్ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్‌ను ఇటీవలే పెళ్లాడిన బాలీవుడ్ నటి బిపాసాబసు అస్వస్థతకు గురైంది. గత కొంత కాలంగా ఆమె శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతుందని.. ఇందులో భాగంగానే ఆమెను ముంబైలోని ఆస్పత్రికి తరలించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
శ్వాసకోస సమస్య కారణంగా ఇప్పటికే పలుమార్లు ఆస్పత్రికి వెళ్లిన బిపాసా.. పరిస్థితి తీవ్రతరం కావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరిందట. ముంబైకి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్ ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
శ్వాసకోశ సంబంధిత చికిత్స కోసం బిపాసా కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. హిందూజా హెల్త్‌కేర్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బిపాసాకు మెరుగైన చికిత్స అందించడం జరుగుతుందని.. త్వరలోనే ఆమె కోలుకోవాలని ఆశిద్దాం..