Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అండ కణం తీసుకుంటామని నమ్మించి.. పిండం పెట్టారు... ఎక్కడ?

ప్రైవేట్ ఆస్పత్రుల మోసాలకు అడ్డూఅదుపు లేకుండాపోతుంది. దీనికి ప్రధాన కారణం మోసాలకు పాల్పడే ఆస్పత్రుల యాజమాన్యాలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడమే.

Advertiesment
Padmasri Hospitals
, గురువారం, 24 మే 2018 (14:08 IST)
ప్రైవేట్ ఆస్పత్రుల మోసాలకు అడ్డూఅదుపు లేకుండాపోతుంది. దీనికి ప్రధాన కారణం మోసాలకు పాల్పడే ఆస్పత్రుల యాజమాన్యాలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోవడమే. తాజాగా, ఓ మహిళ అండాశం నుంచి అండకణం తీసుకుంటామని నమ్మించిన వైద్యులు.. ఆమెకు తెలియకుండా ఏకంగా ఆమె గర్భాశయంలో పిండం పెట్టారు. ఆ పిండం పెరిగి పెద్దదయ్యాకగానీ ఆమెకు అసలు విషయం తెలియలేదు. దీనిపై బాధిత మహిళ గగ్గోలు పెట్టడంతో ఈ విషయం బహిర్గతమైంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తికి భార్య ఉండగా, వీరు విశాఖకు వలస వచ్చారు. అయితే, భార్యతో గొడవపడిన ఆదినారాయణ ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఆ వివాహిత ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. దీన్ని గమనించిన పక్కింట్లోనే ఉంటున్న ఉషా అనే మహిళ ఆమెను పరిచయం చేసుకుంది. అండాన్ని దానం చేస్తే రూ.20 వేల డబ్బు ఇస్తారని నమ్మించింది. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న బాధితురాలు.. ఉష మాటలను గట్టిగా నమ్మిది. దీంతో ఆమెను ఉష విశాఖపట్టణంలోని పద్మశ్రీ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. 
 
ఆస్పత్రిలోనే 15 రోజులపాటు ఉంచి, పలు రక్త పరీక్షలు చేసి, కాగితాలపై సంతకాలు చేయించుకున్న యాజమాన్యం, ఓ రోజు మత్తు మందిచ్చి, ఆపై 9 నెలల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని, తర్వాత రూ.3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. సెల్‌ఫోన్ కూడా లాక్కోవడం, బయటకు వెళ్లే దారిలేకుండా బంధించడంతో, ఆమె ఎలాగోలా తప్పించుకుని పారిపోయింది. 
 
ఆ తర్వాత కడుపులో నొప్పిగా ఉండటంతో రాజాంకు వెళ్లి అసుపత్రిలో చెకప్ చేయించగా, కడుపులో పిండం ఉందని తేలింది. పైగా, బాధితురాలికి ప్రాణహాని ఉందని వైద్యులు చెప్పారు. దీంతో జరిగిన విషయాన్ని భర్తకు చెప్పి.. పద్మశ్రీ హాస్పిటల్‌కు వెళ్లి గర్భం తొలగించాలని కోరితే వారు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగగా, వారికి స్థానిక మహిళా సంఘాలు అండగా నిలిచాయి. అలాగే, రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా చేస్తేనే పెట్రో ధరలు నేలకు దిగుతాయ్ : ఫడ్నవిస్