Webdunia - Bharat's app for daily news and videos

Install App

#HBDAnushkaShetty జేజమ్మకు పుట్టినరోజు విషెస్ : 48వ చిత్రంపై కీలక ప్రకటన

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (11:50 IST)
టాలీవుడ్ జేజమ్మగా ప్రేక్షకుల మనస్సులో చెరగని ముద్రవేసుకున్న అనుష్క... తన పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని తన 48వ చిత్రంపై కీలక ప్రకటన చేశారు. 
 
ఒకవైపు, హీరోయిన్‌గా న‌టిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన ఈ ముద్దుగుమ్మ చివ‌రిగా "నిశ్శ‌బ్ధం" అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆమె త‌దుప‌రి సినిమా కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తూ వ‌చ్చారు. ఈ రోజు అనుష్క బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె 48వ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది.
 
ప్రముఖ దర్శకుడు మహేష్ బాబు.పి డైరెక్షన్‌లో అనుష్క 48వ చిత్రాన్ని చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ సినిమా యు వి క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్‌పై ఇప్పటికే అనుష్క రెండు సినిమాలు చేసింది. మిర్చి, భాగ‌మ‌తి త‌ర్వాత ఇప్పుడు యువీ నిర్మాణ సంస్థ‌తో క‌లిసి హ్యాట్రిక్ మూవీ చేస్తుంది. ఇది కూడా లేడి ఓరియెంటెడ్ మూవీగానే తెరకెక్కుతుంది. 
 
ఇందులో నవీన్ పొలిశెట్టి కీలక పాత్ర చేయనున్నాడని టాక్. ఈ సినిమాకు ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా ‘మిస్. శెట్టి.. మిస్టర్.. పోలిశెట్టి’ అనే టైటిల్ నిర్ణయించినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments