Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏప్రిల్ 1, 2022న మహేష్ బాబు -సర్కారు వారి పాట

Advertiesment
ఏప్రిల్ 1, 2022న మహేష్ బాబు -సర్కారు వారి పాట
, బుధవారం, 3 నవంబరు 2021 (17:07 IST)
Mahesh babu latest
సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెయిన్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. పరుశురామ్ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల విషయంలో అతి పెద్ద అప్డేట్ వచ్చింది.  
 
సర్కారు వారి పాట చిత్రం వచ్చే ఏడాది ఉగాది సందర్బంగా ఏప్రిల్ 1న విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నట్టు  ప్రకటించిన పెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సమయంలో విడుదలైన మ‌హేష్ బాబు  పోకిరి, భరత్ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
 
ఇప్పటికే రిలీజైన‌ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేయ‌నుంది.
 
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ల మీద నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఆర్ మధి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
 
నటీనటులు:  మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు
 
సాంకేతిక బృందం
 
రచయిత, దర్శకుడు: పరుశురామ్ పెట్ల‌
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట
బ్యానర్స్ : మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్
సంగీతం : తమన్
సినిమాటోగ్రఫీ : ఆర్ మధి
ఎడిటర్ : మార్తాండ్ కే వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : ఏఎస్ ప్రకాష్
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్
లైన్  ప్రొడ్యూసర్ : రాజ్ కుమార్
కో డైరెక్టర్ : విజయ రామ్ ప్రసాద్
సీఈవో : చెర్రీ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లోబో దీపావళి అందుకే చేసుకోగలుగుతున్నాడట