'పుష్ప'లో మంగళం శ్రీనుగా సునీల్ - లుక్ రిలీజ్

Webdunia
ఆదివారం, 7 నవంబరు 2021 (11:23 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం తొలి భాగం మాత్రం వచ్చే నెల 17వ తేదీన ప్రేక్షఖుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రంలో హాస్య నటుడు సునీల్ మంగ‌ళం శ్రీను అనే పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, కొద్ది సేప‌టి క్రితం ఆయ‌న లుక్ విడుద‌ల చేశారు మేక‌ర్స్. 
 
ఇందులో సునీల్ బ‌ట్ట‌త‌ల‌తో, భ‌యంక‌ర‌మైన ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తూ క‌నిపించాడు. సునీల్ లుక్ చూసి అంద‌రు స్ట‌న్ అవుతున్నారు. తొలి పార్ట్‌లో సునీల్ విల‌న్‌గా క‌నిపించ‌నుండగా, ఈ పాత్ర ఆయ‌న‌కు మంచి పేరు తీసుకురావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. 
 
చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి సాంగులు విడుదలై… యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుండగా… రీసెంట్‌గావిడుద‌లైన‌ మూడో సింగిల్ ” సామి సామి ” కూడా ర‌చ్చర‌చ్చ చేసింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో ఆయన ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత... ఇపుడు అంతా రివర్స్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments