Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘ‌నంగా ప్రారంభ‌మైన వ‌ర్గో పిక్చ‌ర్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1 'సెహ‌రి'

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (16:08 IST)
వ‌ర్గో పిక్చ‌ర్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి ప్ర‌ధాన పాత్రల‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం "సెహ‌రి". ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. జ్ఞానసాగ‌ర్ ద్వార‌క ద‌ర్శ‌క‌త్వంలో అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి నిర్మిస్తోన్నఈ చిత్రం సంస్థ కార్యాల‌యంలో మంగళవారం పూజా కార్య‌క్ర‌మాతో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు క్లాప్ నివ్వ‌గా, అల్లు బాబీ కెమెరా స్విచాన్ చేశారు. ప్ర‌ముఖ నిర్మాత భ‌ర‌త్ నారంగ్ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు జ్ఞాన సాగ‌ర్‌కు అంద‌జేశారు. 
 
అనంత‌రం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో చిత్ర నిర్మాత అద్వ‌య జిష్ణు రెడ్డి మాట్లాడుతూ, ముందుగా మా టీమ్ అంద‌రినీ ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన దిల్‌రాజు, అల్లు బాబీ, భ‌ర‌త్ నారంగ్‌లకు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. సెహ‌రి ఒక న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరి. ఈ సినిమాకు మంచి టీమ్ కుదిరింది. మీ అంద‌రి స‌పోర్ట్ ఉండాల‌ని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. 
 
నిర్మాత శిల్పా చౌద్రి మాట్లాడుతూ, ప‌క్కాగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేసుకుని షూటింగ్‌కి రెడీ అయ్యాం. కోటి త‌ప్ప మిగ‌తా టీమ్ అంద‌రూ దాదాపు కొత్త‌వారే.. మంచి టీమ్‌తో క‌లిసి వ‌ర్క్ చేయ‌బోతున్నందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అని అన్నారు. 
 
ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు కోటి మాట్లాడుతూ, సంగీత ద‌ర్శకుడిగా 500ల‌కు పైగా చిత్రాలు చేసిన నేను ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ చెప్పిన క‌థ న‌చ్చి ఈ సినిమాలో హీరో తండ్రిగా ఫుల్ లెంగ్త్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాను. ఒక ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఈ చిత్రం. 'సెహ‌రి' అంటే సెల‌బ్రేష‌న్ అని అర్ధం. ఈ సినిమా ప్రారంభోత్స‌వం మా టీమ్ అంద‌రికీ ఒక సెల‌బ్రేష‌న్. వండ‌ర్‌ఫుల్ టీమ్ కుదిరింది. త‌ప్ప‌కుండా ఆర్టిస్టుగా నాకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుంద‌ని న‌మ్ముతున్నాను అని అన్నారు.
 
హీరో హ‌ర్ష్ క‌నుమిల్లి మాట్లాడుతూ, ముందుగా మా సినిమాలో ఒక మంచి పాత్ర‌లో న‌టిస్తోన్న సంగీత ద‌ర్శ‌కులు కోటికి కృత‌జ్ఞ‌త‌లు. ఈ సినిమాలో లీడ్‌రోల్‌లో న‌టించ‌డంతో పాటు మా ఫ్రెండ్స్ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌నల ఆధారంగా క‌థ ‌కూడా నేనే రాయ‌డం జ‌రిగింది.
 
న్యూ ఏజ్ ల‌వ్‌స్టోరిగా ఈ మూవీ త‌ప్ప‌కుండా అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. అభిన‌వ్ గొమటం క్యారెక్ట‌ర్ ఫుల్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. టీమ్ అంద‌రూ మంచి స‌హ‌కారం అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ ఆర్ విహారి ఇప్ప‌టికే రెండు పాట‌లను అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లు అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రికి థాంక్స్‌. మీ అంద‌రి బ్లెసింగ్స్ కావాలి అంటూ ముగించారు.
 
ఇకపోతే, చిత్ర ద‌ర్శ‌కుడు జ్ఞానసాగ‌ర్ ద్వార‌క మాట్లాడుతూ, నెక్ట్స్ వీక్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది. కోటి కేవ‌లం 20 నిమిషాలు న‌రేష‌న్ విని ఈ సినిమాలో క్యారెక్ట‌ర్ చేయ‌డానికి ఒప్పుకున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి పాత్ర‌లు విభిన్నంగా ఉండి త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాయి. 
 
ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం, సురేష్ సారంగం సినిమాటోగ్ర‌ఫి త‌ప్ప‌కుండా మా సినిమాకు ప్ల‌స్ అవుతాయి. మా టీమ్‌ని ఆశీర్వ‌దించ‌డానికి ఇక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని అన్నారు. హీరోయిన్ సిమ్రాన్ చౌద‌రి మాట్లాడుతూ, ఈ సినిమా త‌ప్ప‌కుండా ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్టైన్ చేస్తుంది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కి ధ‌న్య‌వాదాలు అని చెప్పారు.
 
హ‌ర్ష్ క‌నుమిల్లి, సిమ్రాన్ చౌద‌రి, కోటి, బాల‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టం, ప్ర‌నీత్ క‌ళ్లెం, అనీషా రెడ్డి, అక్షి‌త శెట్టి, రాజేశ్వ‌రి, శ్రిస్తి, అనీల్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి బ్యాన‌ర్: వ‌ర్గో పిక్చ‌ర్స్, ద‌ర్శ‌క‌త్వం: జ్ఞానసాగ‌ర్ ద్వార‌క, నిర్మాత‌లు: అద్వ‌య జిష్ణు రెడ్డి, శిల్పా చౌద‌రి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: మేఘ‌న క‌నుమిల్లి, సినిమాటోగ్ర‌ఫి: సురేష్ సారంగం, సంగీతం: ప‌రం శాంత్ ఆర్ విహారి, ఎడిట‌ర్‌: ర‌వితేజ గిరిజ‌ల‌, ఆర్ట్ డైరెక్ట‌ర్‌: సాహి సురేష్‌, క‌థ‌: హ‌రీష్ కొనిమిల్లి, పిఆర్ఒ: వంగశీ - శేఖ‌ర్‌. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments