Webdunia - Bharat's app for daily news and videos

Install App

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

దేవీ
శుక్రవారం, 20 జూన్ 2025 (18:29 IST)
Harish Shankar, Praveen
నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి 'అయ్యో ఏమీరా ఈ జీవితం' అనే లిరికల్‌ వీడియో సాంగ్‌ను బ్లాక్‌బస్టర్‌ మాస్‌ దర్శకుడు హరీష్‌ శంకర్‌ విడుదల చేశారు. 
 
వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించాడు. ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ '' ఇదొక యూత్‌ఫుల్‌ సాంగ్‌. రాహుల్‌ సిప్లిగంజ్‌ తన స్వరంతో ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడు. వికాస బడిస స్వరాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ప్రతి సన్నివేశం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌తో పాటు వినోదాన్ని కూడా పంచుతుంది. ఓ ఇన్నోవేటివ్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందిఅతి త్వరలో చిత్ర విడుదల తేదిని ప్రకటిస్తాం' అన్నారు. 
 
ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments