Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ - హ్యపీ బర్త్‌డే టు హన్సిక

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (09:14 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోకి 'దేశముదురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ హన్సిక మోత్వాని. ఆమె సోమవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటుంది. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ భామ... వచ్చిన ప‌లు సినిమాలు చేసింది. కానీ, ప్రస్తుతం తగిన ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోయింది. 
 
చేసిన ప్ర‌తి సినిమా ఫ్లాప్ కావ‌డంతో హ‌న్సిక కాస్త గ్యాప్ తీసుకుంది. ఆ మ‌ధ్య ‘తెనాలి రామకృష్ణ’ అనే సినిమాలో క‌నిపించి అల‌రించింది. అయితే ఇప్పుడు హ‌న్సిక ప్ర‌ధాన పాత్ర‌లో ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. ది హిడెన్‌ ట్రూత్‌ అనేది ఉపశీర్షికగా ఉన్న చిత్రం రూపొందుతుంది.
 
వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. ‘బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటివరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్రిల్లర్ ఉంటుంద‌ట‌. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది చిత్ర కథాంశం. ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి అనుభూతిని క‌లిగిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు.
 
ఈ రోజు హన్సిక బ‌ర్త్ డే సంద‌ర్భంగా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో హ‌న్సిక సీరియ‌స్ లుక్‌లో ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ కేశినేని నాని..?

కిడ్నీదానం చేసి భర్తను బతికించుకున్న మహిళ.. లారీ రూపంలో మృత్యువు వెంటాడింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments