Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా చాలెంజ్: మొక్కలు నాటిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (19:04 IST)
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా హీరో సుశాంత్ ఇచ్చిన చాలెంజ్‌ను స్వీకరించి నేడు మాదాపూర్‌లో మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ మనుగడకు మొక్కలు చాలా ముఖ్యమని, రోజురోజుకు పట్టణాలలో పచ్చదనం తగ్గిపోతుందని, కాబట్టి అందరూ బాధ్యతాయుతంగా మొక్కలు నాటాలని తెలిపారు. మొక్కలు నాటడం వలన మనం నిత్యం పీల్చుకునే ప్రాణ వాయువు ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభిస్తుందని తెలిపారు.
 
మొక్కలను అధిక స్థాయిలో నాటి వాటిని పెంచి పోషించడం వల్ల ఆక్సిజన్ ఎక్కువ స్థాయిలో లభ్యమవుతుంది. ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని తన అభిమానులను, స్నేహితులను మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టాలని దాన్ని నేను షేర్ చేస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments