Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త పిల్లపై కన్నేసిన పవర్ స్టార్?!

Advertiesment
కొత్త పిల్లపై కన్నేసిన పవర్ స్టార్?!
, మంగళవారం, 3 నవంబరు 2020 (21:44 IST)
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. అటు రాజకీయాల్లో రాణిస్తూనే, ఇటు తనకు అచ్చొచ్చిన సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా, ఇటీవల కొన్ని నెలల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఎంట్రీలో పవన్ వరుస చిత్రాలకు పచ్చజెండా ఊపుతున్నాడు. 
 
ఇప్పటికే పింక్ బాలీవుడ్ రీమేక్ చిత్రంలో నటిస్తున్న పవన్... ఆ తర్వాత హరీశ్ శంకర్‌తో పాటు.. మరికొంతమంది దర్శకులతో కలిసి పని చేయనున్నారు. ఈ క్రమంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్‌లో నటిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా తొలుత సాయి పల్లవి పేరున ప్రముఖంగా ప్రచురించింది. కానీ, ఇంతలో ఏం జరిగిందో తెలియదుకానీ, ఐశ్వర్యా రాజేష్‌ను ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. 
 
ఆ పాత్రకు మొదట సాయిపల్లవి పేరు వినిపించింది. తాజాగా ఐశ్వర్య పేరు తెర మీదకు వచ్చింది. ఈ ఆఫర్ ఐశ్వర్యకు వస్తే తెలుగులో ఆమెకు మరిన్ని మంచి రోల్స్ వచ్చే ఛాన్సుంది. 
 
ఇదిలావుంటే, ఈ తమిళ పిల్లకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు లభిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. 'ఆర్ఆర్ఆర్'లో గిరిజన యువతి పాత్రలో ఐశ్వర్య కనిపించబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అరుదైన రికార్డ్ సృష్టించిన టాలీవుడ్ యాంకర్ ప్రదీప్