Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ - ఆర్ఆర్ఆర్ రిలీజ్ పైన క్లారిటీ వచ్చేసింది

Webdunia
మంగళవారం, 17 నవంబరు 2020 (18:56 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. వేణుశ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవల షూటింగ్ స్టార్ట్ కావడం.. ఇందులో పవన్ కళ్యాణ్ జాయిన్ కావడంతో సంక్రాంతికి వకీల్ సాబ్ రావడం పక్కా అనుకున్నారు.
 
అయితే... దీపావళికి వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ఎలాంటి టీజర్ రిలీజ్ కాకపోవడంతో అసలు విషయం తెలిసింది. ఏంటంటే... ఈ సినిమా సంక్రాంతికి రావడం లేదట. సమ్మర్‌కి రిలీజ్ చేయాలని దిల్ రాజు డిసైడ్ అయినట్టు తెలిసింది.
 
 ఇక సినీ ప్రియులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ - రామ్ చరణ్ - రాజమౌళిల కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
 
ఎన్టీఆర్ ఈ సినిమాకి సంబంధించిన వర్క్‌ను మార్చికి కంప్లీట్ చేయనున్నారు. జులైకి ఈ సినిమా కంప్లీట్ అవుతుంది అని చెబుతున్నారు కానీ... అక్టోబర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని తెలిసింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో చేసే సినిమాని మార్చిలో స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
 
ఆచార్య చిత్రాన్ని 2021 సమ్మర్‌కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే బాలయ్య - బోయపాటి మూవీని కూడా 2021 సమ్మర్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారు. పుష్ప సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.. పైగా సుకుమార్ చాలా టైమ్ తీసుకుంటాడు కాబట్టి... పుష్ప రిలీజ్ పైన క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments