Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్‌, సంపత్‌నందిల భారీ చిత్రం అప్‌డేట్ ఏంటి..?

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:22 IST)
గోపీచంద్‌ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ సంపత్‌ నంది దర్శకత్వంలో ‘యు టర్న్‌’లాంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకం పై ప్రొడక్షన్‌ నెం.3గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న భారీ చిత్రం హై బడ్జెట్‌, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతోంది.
 
ఈ ప్రెస్టీజియస్‌ మూవీలో మిల్కీబ్యూటి తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తుండగా భూమిక, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
 
ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో అజిజ్ నగర్ లో వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలు చిత్ర్రీకరించారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకి రానుంది. 
 
మ్యాచోస్టార్‌ గోపీచంద్‌, మిల్కీబ్యూటి తమన్నా, దిగంగన సూర్యవంశి, భూమిక, రావురమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సౌందర్‌ రాజన్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: తమ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: డి.వై.సత్యనారాయణ, సమర్పణ: పవన్‌ కుమార్‌, నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే- దర్శకత్వం: సంపత్‌ నంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments