Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ -నిర్మాత

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (16:18 IST)
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో నిర్మాత అనిల్‌ సుంకర నిర్మిస్తున్న అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి నటిస్తున్నారు. 
 
సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సందర్భంగా… నిర్మాత అనిల్‌ సుంకర మీడియా సమావేశం ఏరర్పాటు చేసారు.ఈ మీడియా మీట్ లో నిర్మాత అనిల్‌ సుంకర మాట్లాడుతూ... ”140 రోజులు ఎలాంటి అవాంతర పరిస్థితులు ఎదురవకుండా ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ స‌జావుగా పూర్తి అయ్యింది. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్‌కి సిద్ధమైంది. 
 
ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్‌ గర్వపడేలా సినిమా వచ్చింది. ఆడియన్స్‌తో పాటు మేం కూడా ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నాం. మహేష్‌బాబుగారిని ఫ్యాన్స్‌ ఎలా చూద్దాం అనుకుంటున్నారో అలా ఉంటుంది. యూత్‌, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎలా చూడాలనుకుంటున్నారో సినిమా అలా ఉంటుంది.
 
మహేష్‌బాబుగారి కెరీర్‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మూవీ అవుతుంది. 
 
13 సంవత్సరాల తర్వాత విజయశాంతి గారు ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. అవార్డు విన్నింగ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. మహేష్‌, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఎవరూ ఊహించనివిధంగా ఉంటాయి. అనీల్‌ రావిపూడి అనగానే ఎంటర్‌టైన్‌మెంట్‌ గుర్తుకొస్తుంది. 
 
అనుకున్నదానికంటే ఎక్కువ ఫన్‌ ఉంటుంది. ఫస్ట్‌డే ఏదైతే సంక్రాంతికి రిలీజ్‌ అనుకున్నామో ఆ దిశగా సంక్రాంతి విడుదలకు పూర్తి సన్నద్ధమైనందుకు సంతోషంగా ఉంది. ఓవర్సీస్‌లో బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. ఇక్కడ కూడా త్వరలో బుకింగ్స్‌ ఓపెన్‌ చేస్తాం. ఈ సంక్రాంతికి పెద్ద పండగలాంటి సినిమా. మా హీరో నుండి ఇంత వరకు ఇలాంటి ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వచ్చి ఉండదు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టు షాక్...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments