Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి పేరు మార్చుకున్నారా? లేదా తప్పిదమా?

Webdunia
బుధవారం, 6 జులై 2022 (14:53 IST)
మెగాస్టార్ చిరంజీవి తన పేరును మార్చుకున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం "గాడ్‌ఫాదర్". ఈ చిత్రంలో ఆయన పేరు ఇంగ్లీషు అక్షరాల్లో మార్పు చేశారు. తాజాగా విడుదలైన 'గాడ్‌ఫాదర్‌' చిత్రం ఫస్ట్ లుక్‌ను నిశితంగా గమనిస్తే ఈ విషయం తెలుస్తుంది. సక్సెస్‌ కోసమే చిరు తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారని పలువురు అనుకుంటున్నారు. ఇంతకీ, చిరంజీవి పేరులో వచ్చిన మార్పులు ఏమిటి? ఆయన నిజంగానే న్యూమరాలజీ ఫాలో అవుతున్నారా? లేదా టీమ్‌ తప్పిదమా?
 
చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'గాడ్‌ఫాదర్‌'. మలయాళీలో సూపర్‌హిట్‌ అందుకున్న 'లూసిఫర్‌'కు రీమేక్‌ ఇది. మోహన్‌రాజా దర్శకుడు. సోమవారం సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చిరంజీవి పాత్రని పరిచయం చేస్తూ ఆయన పేరుని "Chiranjeevi"కి బదులు "Chiranjeeevi" అని చూపించారు. 
 
ఇక, టైటిల్‌ కార్డులో మాత్రం "megastar CHIRANJEEVI" అనే ఉంచారు. ఇది గమనించిన కొంతమంది నెటిజన్లు.. 'న్యూమరాలజీని అనుసరించే చిరు తన స్పెల్లింగ్‌లో మరో 'E' కలుపుకున్నారా?' అని చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా, 'గాడ్‌ఫాదర్‌' మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరులో మార్పుకి టీమ్‌ తప్పిదమే కారణమని తాజాగా వార్తలు బయటకు వస్తున్నాయి. 
 
టీమ్ చేసిన పొరపాటుతోనే మోషన్‌ పోస్టర్‌లో చిరు పేరు రెండు రకాలుగా కనిపిస్తోందని, ప్రస్తుతం చిత్రబృందం ఆ పేరుని ఎడిట్‌ చేసి.. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటోందని పలు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments