Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సినీ ఎడిటర్ గౌతంరాజు కుటుంబానికి చిరంజీవి 2 లక్షల సాయం

Advertiesment
Tammareddy cheack to Gotamraju family
, బుధవారం, 6 జులై 2022 (14:18 IST)
Tammareddy cheack to Gotamraju family
టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు అనారోగ్య కారణాలతో ఈరోజు కన్నుమూశారు. తెలుగు సహా వివిధ బాషల్లో సుమారు 800 పైగా సినిమాలకు పని చేసిన ఆయన సినిమా కోసమే పుట్టారేమో అంటూ తెలుగు పరిశ్రమలో వారు అంటూ ఉంటారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన అనారోగ్య కారణాలతో కొన్నాళ్ల క్రితమే హాస్పిటల్లో చేరారు. కొన్నిరోజులు క్రితమే డిస్చార్జ్ అయ్యారు. అయితే అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. 
 
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమాలకు ఎడిటర్ గా వ్యవహరించిన ఆయన మృతికి మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాక ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆ కుటుంబానికి తక్షణసాయంగా రెండు లక్షల రూపాయలను మెగాస్టార్ చిరంజీవి గారు తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా అందజేశారు. ఈ మేరకు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రెండు లక్షల రూపాయలను ఎడిటర్ గౌతమ్ రాజు కుటుంబ సభ్యులకు ఇచ్చారు. అండగా ఉంటామని, ధైర్యం కోల్పోవద్దని మెగాస్టార్ చిరంజీవి వారి కుటుంబానికి చెప్పమన్నట్లు తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా వెల్లడించారు.
గౌతంరాజ మృతిప‌ట్ల ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. 
 
ఆయ‌న భౌతికాయం మోతీన‌గ‌ర్‌లో స్వ‌గృహంలో వుంచారు. ఈరోజు మ‌ధ్యాహ్నం ఫిలింన‌గ‌ర్‌లోని మ‌హాప్ర‌స్తానంలో అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అఖిల్ రాజ్, అనన్య నాగల్ల జంట‌గా చిత్రం ప్రారంభం