తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ ఎడిటర్ గౌతంరాజు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం వేకువజామున 1.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సీనియర్ నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున తదితరులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. గౌతంరాజు వంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడంతో దురదృష్టకరమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆయన ఎంత సౌమ్యుడో ఆయన ఎడిటింగ్ అంత వాడిగా ఉంటుందని గుర్తుచేశారు.
తన "చట్టానికి కళ్లు లేవు" సినిమా నుంచి "ఖైదీ నంబర్ 150" వరకు ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పని చేసిన గౌతం రాజు లేకపోవడం వ్యక్తిగతంగా నాకు, మొత్తం పరిశ్రమకు పెద్ద లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపనం తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
గౌతంరాజు మృతి
తెలుగు సినిమారంగంలో సీనియర్ ఎడిటర్ అయిన గౌతంరాజు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన ఒంటరిగానే వుంటున్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో ఇంటివద్దనే వున్నారు. ఆయన మరణవార్త తెలిసినవెంటనే సినీప్రముఖులు, శ్రేయోభిలాషులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
చిరంజీవి, పవన్‌కళ్యాణ్, ఎన్.టి.ఆర్. రామ్‌చరణ్ ఎలా అందరి అగ్రనాయకుల చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన ఎడిటింగ్ చేస్తే దర్శక నిర్మాతలకు, హీరో భరోసాగా వుండేది. అనవసరమైన లాగ్‌లు లేకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఆయన చెబుతుండేవారు.
అందుకే ఆయనంటే సినీరంగానికి ప్రీతి. దాదాపు దక్షిణాదిబాషలతోపాటు హిందీ సినిమాలకు కూడా ఎడిటర్‌గా పనిచేశారు. అప్పట్లో ఆది సినిమాకు ఉత్తమ ఎడిటర్‌గా అవార్డు అందుకున్నారు. ఆయన భౌతికాయం జూబ్లీహిల్స్‌లోని స్వగృహంలో వుంచారు. బుధవారంనాడు అంత్యక్రియలు జరగనున్నాయి.