Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకట్టుకుంటున్న మంగంపేట ఫస్ట్ లుక్, విజువల్ ట్రీట్‌గా గ్లింప్స్

డీవీ
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (14:04 IST)
Mangampet first look
చంద్రహాస్ కే, అంకిత సాహా కాంబినేషన్‌లో భాస్కర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘మంగంపేట’. గౌతం రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీహరి చెన్నం, రాజేంద్ర పోరంకి సహ నిర్మాతలుగా.. మానస్ చెరుకూరి, ప్రముఖ్ కొలుపోటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరించిన ఈ మూవీ గ్లింప్స్‌ను రీసెంట్‌గా విడుదల చేశారు.
 
'ఈశ్వర్.. 20 ఏళ్లు అయిందిరా.. ఊరిని చూడాలనిపిస్తుందిరా.. చూపిస్తావా?..’, ‘కొన్ని రోజులు ఆగమ్మా.. ఊరినిండా రాక్షసులే ఉన్నారు.. వాళ్లని చంపి.. ఊరిని చూపిస్తానమ్మా..’, ‘చంపాల్సింది రాక్షసుల్ని కాదు.. రావణుడ్ని..’,‘రాముడు రాలేకపోవచ్చు.. శివుడు శూలాన్ని పంపిస్తే.. చేయాల్సింది యుద్దం కాదు.. శివ తాండవం..’ అంటూ సాగిన డైలాగ్స్.. చూపించిన విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. హీరో చంద్రహాస్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే మాస్ ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చేలా ఉన్నాయి.
 
మంగంపేట టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్‌‌లో ఉంది. కెమెరామెన్ ఈ మూవీ కోసం వాడిన కలర్ గ్రేడింగ్, పెట్టిన షాట్స్, మ్యూజిక్ ఢైరెక్టర్ ఇచ్చిన ఆర్ఆర్ అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌కు సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఉంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మిగిలిన వివరాలను ప్రకటించనున్నారు.
 
నటీనటులు : చంద్రహాస్ కే, అంకిత సాహా, నాగ మహేష్, కబీర్ దుహన్ సింగ్, కాలకేయ ప్రభాకర్, దయానంద్ రెడ్డి, ఎస్టర్ నోరోన్హా, పృధ్వీరాజ్, అడుకలం నరేన్, సమ్మెట గాంధీ, 14 రీల్స్ నాని, ఈశ్వర్ రాజనాల, సమీర్, దొరబాబు తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments