Geethamadhuri : కానిస్టేబుల్ లో గీతామాధురి పాడిన ధావత్ సాంగ్ కు ఆదరణ

చిత్రాసేన్
సోమవారం, 6 అక్టోబరు 2025 (10:39 IST)
Constable item song poster
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా తెరకెక్కుతున్న చిత్రం కానిస్టేబుల్. జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మిస్తున్నారు. విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ఈ చిత్రంలోని ధావత్ అనే ఐటమ్ సాంగ్ ను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ చేతులమీదుగా విడుదల చేశారు. అనంతరం భరత్ భూషణ్ స్పందిస్తూ, చిత్రం విజయవంతం కావాలని అభినందనలు తెలిపారు.
 
ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, సెన్సార్ విజయవంతంగా పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందడం చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్ కు ఈ చిత్రం మరో మలుపు అవుతుందని అన్నారు. 
 
నిర్మాత బలగం జగదీష్ మాట్లాడుతూ, సెన్సార్ పూర్తి కావడం, అలాగే ట్రైలర్ కి వచ్చిన స్పందన  నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ నెల్ల 10న ఇలాంటి ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల తీర్పు కోసం వస్తున్నామని చెప్పారు. అలాగే ఇందులోని ఒక మంచి ఐటమ్ సాంగ్ ను దసరా సందర్భంగా విడుదల చేశాం. దానికి కూడా మంచి స్పందన రావడం  సంతోషంగా ఉందన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ SK మాట్లాడుతూ, సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ట్రైలర్ కు వచ్చిన స్పందనతోనే  మేము సగం విజయం సాధించామని అనుకుంటున్నాం. 50  లక్షల మది ట్రైలర్ చూడడం అంటే అది మామూలు విషయం కాదని అన్నారు. 
 
 ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో  దువ్వాసి మోహన్, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు తారాగణం. 
 
 ఈ చిత్రానికి కెమెరా; హజరత్ షేక్ (వలి), సంగీతం :సుభాష్ ఆనంద్, ఎడిటింగ్: వర ప్రసాద్, బి.జి.ఎం.:గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు, మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు, శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య, సహనిర్మాత: బి నికిత జగదీష్, కుపేంద్ర పవర్, నిర్మాత; బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం;: ఆర్యన్ సుభాన్ SK.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments