Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

Advertiesment
Dr.: Rajendra Prasad, Varun Sandesh, Madhulika Varanasi

దేవీ

, సోమవారం, 1 సెప్టెంబరు 2025 (11:20 IST)
Dr.: Rajendra Prasad, Varun Sandesh, Madhulika Varanasi
వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన  థ్రిల్లర్ చిత్రం "కానిస్టేబుల్".  జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది. సీనియర్ నటుడు డా: రాజేంద్ర ప్రసాద్  ట్రైలర్ ను విడుదల చేశారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతంలో నేను కూడా పోలీస్ పాత్రలు చేశాను. అయితే ఆ పాత్రలు కామెడీ ప్రధానంగా సీరియస్ నెస్ సాగేవి. కానీ ఈ సినిమా కంటెంట్ నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా ఉంది. వరుణ్ సందేశ్ కూడా తన పాత్రలో ఒదిగి పోయి ఉంటాడని భావిస్తున్నానని అన్నారు.
 
అతిధులు తెలంగాణ కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నటుడు శివారెడ్డి లు మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమాలకు నేడు అధిక ప్రాధాన్య ఉంది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాలకే భ్రహ్మరథం పడుతున్నారు. పోలీస్ వారు మన భద్రతకు అహర్నిశలు ఎంత శ్రమ పడుతున్నారో మనకు తెలిసిందే. అలాంటి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
 
హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ..నాకు ఇప్పటి వరకు లవర్ బాయ్ గా పేరు ఉంది. అయినప్పటికీ విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకొని నటించడాని ప్రయత్నిస్తున్నాను. ఈ కథను డైరెక్టర్ ఆర్యన్ సుభాన్ నాకు చెప్పినప్పుడు కానిస్టేబుల్ క్యారెక్టర్ ను ఊహించుకొని చెయ్యగలననే నమ్మకం ఏర్పడిన తరువాత ఈ సినిమా చెయ్యడం జరిగింది. సినిమాతో పాటు నా పాత్ర కూడా బాగా వచ్చిందని మూవీ టీం చెప్పడంతో చాలా సంతోషం కలిగింది. తప్పకుండా మా అంచనాలను నిలబెదుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
 
చిత్ర నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ.. కంటెంట్ ను నమ్మి ఈ సినిమా చేశాము .ఈ కథకు ఏడు, నుండి 8 మంది హీరో లను ఆలోచించాము. అయితే వరుణ్ సందేశ్ అయితే బాగుంటుందని ఆయన్ని సంప్రదించాము. ఆయనకు ఈ కథ నచ్చడంతో ఈ సినిమాను చేశారు.ఒక వ్యక్తి కి అవమానం జరిగినప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుందో అనే అంశానికి సందేశాన్ని మిలితం చేసి ఈ సినిమాను చేశాము అని అన్నారు.
 
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ.. మా అందరి కేరీర్ ను మలుపుతిప్పే చిత్రమవుతుంది.వరుణ్ సందేశ్ కు కూడా కమ్ బ్యాక్ చిత్రమవుతుంది. ఇందులో ఆణి ముత్యాల్లాంటి నాలుగు పాటలు ఉన్నాయి. కానిస్టేబుల్ కు సంబందించిన పాటను గద్దర్ నర్సన్న అద్భుతంగా పాడారు. అలాగే ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఇంకో పాటను పాడారు. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలున్న చిత్రమిది.బాధ్యతలను గుర్తు చేస్తూ హృదయాలను హత్తుకునే సినిమా ఇది.పోలీస్ కుటుంబాలు అందరూ చూసిన మా సినిమాకు బాగా డబ్బులు వస్తాయని అన్నారు.
 
ఇంకా ఈ కార్యక్రమంలో చిత్ర హీరోయిన్ మధులిక వారణాసి,వరుణ్ సందేశ్ సతీమని వితిక, కెమెరామెన్ హజరత్ వలి, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, గాయకుడు గద్దర్ నర్సన్న, డైస్ ఆర్ట్ ఫిల్మ్స్ అధినేత హర్ష, నటుడు దువ్వాసి మోహన్, నటీమణులు కల్పన, తేజు, భావన, నిత్య తదితరులు పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమంలో  ముగ్గురు రియల్ కానిస్టేబుల్స్ ను సత్కరించడం జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్