Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందు లాంటి రిలేషన్ కానిది ఏదైనా ఒకటే.. గీతా మాధురి

ఓ మనిషిని కళ్లల్లో కళ్లు పెట్టి చూడకుండా జుట్టుని, చెవులను, ముక్కును చూసి మాట్లాడాలా.. సామ్రాట్‌తో అలా వుంటే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తోంది గీతామాధురి.

Webdunia
శుక్రవారం, 12 అక్టోబరు 2018 (12:21 IST)
ఓ మనిషిని కళ్లల్లో కళ్లు పెట్టి చూడకుండా జుట్టుని, చెవులను, ముక్కును చూసి మాట్లాడాలా.. సామ్రాట్‌తో అలా వుంటే తప్పేంటి అంటూ ప్రశ్నిస్తోంది గీతామాధురి. రోల్ రైడాతో చాలా గేమ్స్ ఆడాను.. అమిత్ భయ్యాతో చాలా గేమ్స్ ఆడాను. కానీ సామ్రాట్ విషయంలోనే అలా అయ్యింది దీనికి తానేం చేయను అంటూ అడిగింది. తనకు నందు లాంటి రిలేషన్ కానిది ఏదైనా ఒకటేనని గీతామాధురి చెప్పింది. 
 
తమ్ముడైనా, స్నేహితుడైనా, ఫాదరైనా, కజిన్ అయినా ఒకేలా నడుచుకుంటానని.. నందు లాంటి రిలేష్ కానిది ఏదైనా తాను ఒకేలా వుంటానని తెలిపింది. అన్నింటినీ భూతద్దంలో పెట్టి చూడటం ఏమిటని ప్రశ్నించింది. తానేంటో నందుకు బాగా తెలుసునని.. సామ్రాట్ తనకు మంచి సోదరుడని.. స్నేహితుడని తెలిపింది. 
 
తమ్ముడైతేనే మాట్లాడాలని షరతులేంటి అంటూ గీతా మాధురీ ప్రశ్నించింది. ఈ విషయంలో తనకు చాలామంది సపోర్ట్ చేస్తున్నారని.. సోదరుని వరుస వుండే వ్యక్తితోనే మాట్లాడాలని.. అలా వేరేవరితోనైనా మాట్లాడితే కొత్త అర్థాలు వస్తున్నాయని చాలామంది అమ్మాయిలు తనతో వాపోతున్నారని గీతా మాధురీ చెప్పింది. 
 
తామంతా కొన్ని నెలల పాటు కలిసి వున్నాం. చాలీచాలని ఆహారాన్ని పంచుకున్నాం. కొట్టుకున్నాం. కానీ మళ్లీ కలిసిపోయామని తెలిపింది. నెక్ట్స్ బిగ్‌బాస్‌కి వచ్చే వాళ్లను ఎవరినీ ముట్టుకోవద్దు, ఎవరినీ చూడొద్దు, ఎవరితో మాట్లాడొద్దు సైడ్‌కి వెళ్లిపోయి సైలెంట్‌గా వెళ్లి కూర్చో అని చెప్తే ఏ బాధ వుండదని గీతా మాధురి ఎద్దేవా చేసింది. 
 
తమ బాండింగ్ తమకు తెలుసు. దాన్ని రకరకాలుగా చూస్తే తానేమీ చెయ్యలేదని.. సామ్రాట్ రాఖీ కట్టమని అడిగాడు. అయినా రాఖీ కట్టడంలో తప్పేముంది అంటూ గీతామాధురి తెలిపింది.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments