అడుగు దూరంలో టైటిల్ మిస్సయిన గీత... ఆ రిలేషనే కారణమా?

బిగ్ బాస్ సీజన్ 2 మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గీతా మాధురి టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. కౌశల్, గీత మధ్య విన్నర్ ఎవరో భారీ ఉత్కంఠ తర్వాత గెస్ట్‌గా వచ్చిన విక్టరీ వెంకటేష్ విన్నర్‌గా కౌశల్‌ను, రన్నర్‌గా గీతను ప్రకటించారు.

సోమవారం, 1 అక్టోబరు 2018 (11:03 IST)
బిగ్ బాస్ సీజన్ 2 మొదటి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన గీతా మాధురి టైటిల్‌కి ఒక్క అడుగు దూరంలో ఉండిపోయింది. కౌశల్, గీత మధ్య విన్నర్ ఎవరో భారీ ఉత్కంఠ తర్వాత గెస్ట్‌గా వచ్చిన విక్టరీ వెంకటేష్ విన్నర్‌గా కౌశల్‌ను, రన్నర్‌గా గీతను ప్రకటించారు. 
 
ముందు నుండి బ్యాలెన్స్డ్‌గా తనదైన శైలిలో గేమ్ ఆడుతున్న గీతా మాధురి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న వ్యక్తులలో ఒకరిగా ఉన్నారు. కౌశల్‌కు, ఆమెకు మధ్య ఉన్న గొడవలే ఆమె ఓట్ల శాతాన్ని దెబ్బ తీసుంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. మొదట్లో భానుశ్రీ మరియు కౌశల్ గొడవలో అతని వైపు నిలిచి తేజస్వి, ఇంకా భానుతో గొడవకు దిగింది. 
 
ఆ తర్వాత హౌస్‌లో జరిగిన పరిణామాలు వారి మధ్య అనేక వాగ్వివాదాలకు దారి తీసాయి. అంతేకాకుండా కౌశల్‌ను బలమైన కంటెస్టెంట్‌గా మార్చాయి. ఇక సీక్రెట్ టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేసి, ఫలితంగా వచ్చిన అవకాశంతో సీజన్ మొత్తం నామినేషన్స్‌లో ఉండేలా చేసింది. దీంతో కౌశల్‌పై సింపతీ పెరగడమే కాకుండా కౌశల్ ఆర్మీ దృష్టి గీతపై పడింది.
 
మరో విషయమేంటంటే, గీత, సామ్రాట్ మధ్య మాటిమాటికీ మారుతున్న రిలేషన్ ఎఫెక్ట్ కూడా బాగానే ఉందని చెప్పాలి. ఎప్పుడూ కళ్లలో కళ్లు పెట్టి చూసుకుంటూ, హగ్ చేసుకుంటూ ఒక్కోసారి ఒక్కో రిలేషన్‌ పేరు చెప్తూ ఏమైనా అడిగితే ప్రేక్షకులు ఏమి అనుకుంటే మనకు ఏంటి, మనం కరెక్ట్‌గా ఉన్నామా లేదా అన్నది మన మనస్సుకు తెలుసు, వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ దీప్తితో జరిగిన ఒక చర్చలో భాగంగా మాట్లాడటం ఆమెను టైటిల్‌కి దూరం చేసిన మరో అంశం.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం వాట్సాప్ వినియోగంపై భార్యాభర్తల కీచులాట... ఇద్దరూ ఆత్మహత్య