Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బు కోసం హీరోయిన్‌గా మారిపోతున్న సింగర్.. ఎవరు?

హీరోయిన్‌గా గీతామాధురి తెరగేంట్రం చేయడానికి సిద్ధమవుతోంది. గాయనిగా తన టాలెంట్‌ను చూపించిన గీతామాధురి నటనవైపు వెళ్ళేందుకు ఆశక్తి చూపుతోందట. అటు మాస్ సాంగ్స్ అయినా, ఇటు సాంప్రదాయ గీతాలైనా పాడి అందరి మెప్పించే గాయని గీతామాధురి, నచ్చావులే సినిమాలో నిన్నే

Advertiesment
డబ్బు కోసం హీరోయిన్‌గా మారిపోతున్న సింగర్.. ఎవరు?
, సోమవారం, 24 సెప్టెంబరు 2018 (11:12 IST)
హీరోయిన్‌గా గీతామాధురి తెరగేంట్రం చేయడానికి సిద్ధమవుతోంది. గాయనిగా తన టాలెంట్‌ను చూపించిన గీతామాధురి నటనవైపు వెళ్ళేందుకు ఆశక్తి చూపుతోందట. అటు మాస్ సాంగ్స్ అయినా, ఇటు సాంప్రదాయ గీతాలైనా పాడి అందరి మెప్పించే గాయని గీతామాధురి, నచ్చావులే సినిమాలో నిన్నే నిన్నే కోరి పాట పాడి నంది అవార్డును కూడా దక్కించుకుంది. నచ్చావులే చిత్రంలో గీతా మాధురి పాడిన పాటలకు మంచి ఆదరణ లభించింది. ఆ తరువాత వరుసగా చిరుత, రేసుగుర్రం, శ్రీమంతుడు చిత్రాల్లో ఆమె పాడిన పాటలు మాస్‌లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 
 
గాయనిగే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా గీతామాధురి అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే వీటితో పాటు హీరోయిన్‌గా చేయాలన్న ఆసక్తి ఆమెలో ఎక్కువగా పెరిగిందట. త్వరలో ఒక థ్రిల్లర్ యాక్షన్ సినిమాలో హీరోయిన్‌గా గీతామాధురి నటించబోతోందట. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ మొత్తం సిద్థమైనట్లు తెలుస్తోంది. వడ్డినేని గోపి దర్శకుడి సారథ్యంలో సినిమా తెరకెక్కబోతోందట. 
 
ప్రస్తుతం బిగ్ బాస్-2లో బిజీగా ఉన్న గీతామాధురి అది పూర్తి కాగానే హీరోయిన్‌గా నటించడానికి సిద్థమవుతోందట. హీరోయిన్ అయిన తరువాత కూడా పాటలు పాడటం, డబ్బింగ్ చెప్పడం మాత్రం మాననని చెబుతోంది గీత. తాను అనుకున్న దాంట్లో పూర్తిగా డబ్బులు రాకపోవడం వల్ల ప్రస్తుతం ఆర్థిక సమస్యలు కూడా గీతామాధురికి ఎక్కువగా ఉన్నాయట. హీరోయిన్‌గా పరిశ్రమలో అడుగుపెడితే డబ్బుకు డబ్బు పేరుకు పేరు అన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి హీరోయిన్‌గా గీతామాధురి ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుక్క అంటే అర్థం ఇది.. కౌశల్ కవరింగ్... నాని అసంతృప్తి