Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాముణ్ణి కాదు.. హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయి : 'గరుడవేగ' హీరో

"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. హీరోయిన్ జీవితను పెళ్లి చేసుకోకముందు, వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకు పలువురు హీరోయిన్లతో అఫైర్లు ఉన్

Webdunia
ఆదివారం, 12 నవంబరు 2017 (15:38 IST)
"పీఎస్వీ గరుడవేగ" చిత్రం విజయంమత్తులో ఉన్న హీరో డాక్టర్ రాజశేఖర్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. హీరోయిన్ జీవితను పెళ్లి చేసుకోకముందు, వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకు పలువురు హీరోయిన్లతో అఫైర్లు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
గత కొన్నేళ్లుగా విజయం కోసం పరితపిస్తూ వచ్చిన రాజశేఖర్‌కు 'గరుడవేగ' సినిమాతో సక్సెస్ బాట పట్టారు. ఈ విజయం ఆయనకు చాలా ఆత్మస్థైర్యాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, తనతల్లి మరణం తనను కుంగదీస్తే.. ఈ సినిమా విజయం ధైర్యాన్నిచ్చిందని అన్నారు. గతంలో చాలా రోజుల కిందట తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన తారా చౌదరితో సంబంధాలున్నాయట కదా? అన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు.
 
తానేమీ రాముడిని కాదని అన్నారు. పెళ్లికి ముందు కొందరితో సంబంధాలున్నాయని చెప్పేశారు. అలాగే జీవితతో పెళ్లి తర్వాత కూడా కొందరితో సంబంధాలున్నాయని ఆయన నిజాయతీగా ఒప్పుకున్నారు. కానీ తారా చౌదరితో మాత్రం ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తనతో ఆమె ఒకసారి ఫోటో దిగిందని, అప్పుడే ఆమెను తొలిసారి చూశానన్నారు. అంతేకానీ, తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని ఆయన స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments