రాజశేఖర్ మనసున్న మనిషి.. నా బిడ్డ ప్రాణాలు కాపాడారు: సునీల్
						
		
						
				
సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ అన్నాడు. ''గరుడవేగ'' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు. తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్
			
		          
	  
	
		
										
								
																	సినీ నటుడు, వైద్యుడు అయిన హీరో రాజశేఖర్ మనసున్న మనిషి అని కమెడియన్ కమ్ హీరో సునీల్ అన్నాడు. ''గరుడవేగ'' సినిమా విజయవంతమైనందుకు రాజశేఖర్‌కి అభినందనలు తెలియజేశాడు.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	తాజాగా ఒక స్టార్ హోటల్లో జరిగిన క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్‌లో గరుడ వేగ సినిమా టీమ్ పాల్గొంది. వాళ్లతో పాటు ఈవెంట్‌లో సునీల్ కూడా పాల్గొనడం విశేషం.
 
									
										
								
																	
	 
	ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. రాజశేఖర్ అంటే తనకి ఎంతో అభిమానమని.. ఒక హీరోగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడాడు. 
 
									
											
							                     
							
							
			        							
								
																	నిజజీవితంలోనూ తనకు ఆయన సహాయం చేశారని.. ఓసారి వైద్యుడిగా తన కుమార్తె ప్రాణాలు కూడా రాజశేఖర్ కాపాడారని సునీల్ అన్నాడు. 
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన పీఎస్‌వీ గరుడవేగ మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమాకు యూఎస్‌లో 64వేల డాలర్ల మొత్తం వచ్చిందని, ఇక శనివారం ఒక్కటే ఏకంగా లక్ష డాలర్ల మార్కును తాకిందని సమాచారం.