Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంగవ్వకు కారావాన్.. రూ.30 లక్షలట.. కారావాన్ వ్లాగ్ వీడియో రిలీజ్

Webdunia
సోమవారం, 11 జులై 2022 (18:43 IST)
యూట్యూబ్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న వారిలో గంగవ్వ టాప్ ప్లేసులో వుంది. బిగ్ బాస్ కంటిస్టెంట్ అయిన గంగవ్వ... కేవలం యూట్యూబ్ ద్వారానే కాకుండా టెలివిజన్ రంగంలో అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ మంచి ఆదాయాన్ని కూడా సంపాదించుకుంటుంది. 
 
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గంగవ్వ సొంత ఇంటిని నిర్మించుకుంది. నాగార్జున ఆర్థిక సహాయం అలాగే బిగ్‌బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌తో ఆమె ప్రత్యేకంగా తన సొంత ఊర్లోనే ఒక మంచి ఇల్లును నిర్మించుకొని అందుకు సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్‌లో విడుదల చేసింది. 
 
అయితే అప్పుడప్పుడు గంగవ్వ కొత్త సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా నటీనటులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు కూడా చేయడం జరుగుతుంది. మై విలేజ్ షో టీమ్ తో కలిసే ఇదివరకే ఆమె సమంత సాయి పల్లవి తమన్నా అలాగే చాలామంది సెలబ్రిటీలతో కూడా ఇంటర్వ్యూలు చేసే మంచి క్రేజ్ అయితే అందుకుంది. 
 
అయితే ఈ క్రమంలో ఆమెకు ప్రత్యేకంగా కారావాన్ కూడా ఇస్తున్నారు. నెట్ ఫ్లిక్స్‌లో విరాటపర్వం విడుదలవుతున్న సందర్భంగా హీరో హీరోయిన్ తో కలిసి గంగవ్వ ప్రత్యేకంగా మరొక ఇంటర్వ్యూ చేసింది. రానా దగ్గుపాటి సాయిపల్లవి ఇద్దరు కూడా చాలా సరదాగా ఆమెతో మాట్లాడారు. అయితే గంగవ్వ ముందుగానే కారావాన్ వ్లాగ్ వీడియో ద్వారా తన అనుభవాన్ని తెలియజేసింది.
 
కారావాన్‌లో ఉన్నప్పుడు గంగవ్వ చాలా అద్భుతంగా ఉంది అంటూ అందులో సదుపాయాల గురించి కూడా తెలియజేస్తుంది. అలాగే దాని రేటు దాదాపు 30 లక్షల వరకు ఉంటుంది అని కూడా తెలియజేయడం విశేషం.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments