Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్ న‌న్ను ఇన్‌స‌ల్ట్ చేశావ్ - అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆవేద‌న‌

Webdunia
సోమవారం, 11 జులై 2022 (17:07 IST)
Nitin, Amma Rajasekhar
మ‌న‌కు జ‌న్మ ఇచ్చిన అమ్మ‌ను, గురువును మ‌ర్చిపోకూడ‌దు. కొంద‌రు ఎందుకు సూప‌ర్ స్టార్‌లు అవుతారో తెలుసుకోవాలి. నితిన్ నువ్వు న‌న్ను ఇన్‌స‌ల్ట్ చేశావ్‌. నేను హ‌ర్ట్ అయ్యాను. అంటూ ద‌ర్శ‌కుడు అమ్మ రాజ‌శేఖ‌ర్ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఆయ‌న తాజాగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా `హైయ్ ఫైవ్‌. సినిమా ఇప్ప‌టి ట్రెండ్‌కు త‌గిన సినిమా. ఆయ‌న భార్య రాధ నిర్మాత‌. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైద‌రాబాద్‌లో జ‌రిగింది. 
 
ఈ సంద‌ర్భంగా అమ్మ రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ, హీరో నితిన్‌కు 10రోజుల ముందే ఫంక్ష‌న్ గురించి చెప్పాను. వ‌స్తాన‌న్నాడు. కానీ ఈరోజు రాలేదు. పోనీ షూటింగ్‌లో వున్నాడంటే అదీ లేదు. ఇంటిలోనే వున్నాడు. క‌నీసం బైట్ కూడా ఇవ్వ‌లేదు. లైప్‌లో ఎదిగిన‌ప్పుడు మూలాల‌ను మ‌ర్చిపోకూడ‌దు. త‌న‌కు డాన్స్ రాదు. నేను డాన్స్ నేర్పించాను. గురువుగా వున్నాను. గౌర‌వించాను. ఈరోజు నువ్వు ఇంటిలోనే వుండి రాలేదంటే నేను చాలా బాధ‌ప‌డ్డాను.  నేను ఫంక్ష‌న్‌కు రాలేను అన్నా బాగుండేది. కానీ వ‌స్తాన‌ని చెపితే ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ నువ్వు రాలేదు. నాకూ మ‌రో రోజు వ‌స్తుంది అంటూ ఘాటుగానే అన్నారు. మ‌రి దీనికి కౌంట‌ర్‌గా నితిన్ ఏమి చెబుతాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments