Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణేష్, వర్ష బొల్లమ్మ స్వాతిముత్యం ప్రచార చిత్రం

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2022 (10:07 IST)
Swathimutyam campaign
గణేష్‘ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. ‘వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
ఈరోజు చిత్ర కథానాయకుడు గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ట్రైలర్ పేరుతో ఓ సంక్షిప్త 
 ప్రచార చిత్రం ను విడుదల చేసింది చిత్ర బృందం. దాదాపు నలభై క్షణాల పాటు సాగే ఈ దృశ్య మాలిక ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. 
" మన బాలూ ఏంచేసాడో కొంచం నీకర్థమయ్యేలా చెబుతాను...
చెప్పండి...
అంటే .....అదీ....!
కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా
ప్రాబ్లమా.. ప్రాబ్లమ్ ఏముంటుందండి...?
మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నా కిప్పుడర్ధమయింది" వంటి సంభాషణలు నాయిక,నాయకుల మధ్య వినిపిస్తాయి. రావురమేష్, వెన్నెలకిషార్ లు కూడా ఇందులో చిత్రానుసారం కనిపిస్తారు. చిత్రం  థియేట్రికల్ ట్రైలర్ త్వరలోనే విడుదల అన్న ప్రకటనతో పాటు, దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు "స్వాతిముత్యం" ను అక్టోబర్ 5 న విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది.ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు. 
 
గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. 
 
సాంకేతిక వర్గం:
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: అవినాష్ కొల్ల
పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
రచన, దర్శకత్వం: లక్ష్మణ్ కె.కృష్ణ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ కేసు: జగన్‌ను అదానీ ఎప్పుడెప్పుడు కలిశారు.. అమెరికా అభియోగాల్లో ఏముంది?

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments