Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌ విజేత కౌశల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా?

Webdunia
మంగళవారం, 30 అక్టోబరు 2018 (16:55 IST)
బిగ్ బాస్‌ విజేత కౌశల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కౌశల్.. రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కర్నూలులో ఓ కార్యక్రమంలో హాజరై అభిమానులతో కలిసి అన్నదానం నిర్వహించిన కౌశల్.. రాజకీయాలపై కామెంట్స్ చేశాడు. 
 
సమాజ సేవ చేయాలన్నది తన కోరిక అని, ఇందుకోసం రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని ఆలోచిస్తానని కౌశల్ తెలిపాడు. రాజకీయాల్లోకి రాకుండా కూడా సమాజ సేవ చేయొచ్చునని.. అయితే, సేవకు రాజకీయాలు మంచి మార్గమని అన్నాడు. అభిమానులతో కలిసి సమాజసేవ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు.
 
బిగ్‌బాస్‌తో తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న కౌశల్ పేరిట అప్పట్లో ఆర్మీ ఏర్పాటైంది. అతడు గెలవాలని పూజలు, 2కే, 3కేరన్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే అది ఫేక్ ఆర్మీ అంటూ బాబు గోగినేని వంటి వారు ఆరోపణలు కూడా చేశాడు. 
 
ఇకపోతే.. బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ ఆ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని క్యాన్సర్ బాధితుల సహాయార్ధం వినియోగిస్తానని ఇప్పటికే తెలిపారు. ఇప్పటికే కౌశల్ ఆర్మీ నిర్వహించిన ఓ విజయోత్సవ సభకు కుటుంబంతో పాటు హాజరైన కౌశల్.. బిగ్ బాస్ హౌస్‌లో వున్నప్పుడు తనకు లక్షలాది మంది అభిమానులు వున్నారనే విషయం తెలియక మధ్యలోనే వెళ్లిపోవాలనుకున్నానని చెప్పాడు. కానీ ఎప్పుడైతే హోస్ట్ నాని కౌశల్ ఆర్మీ గురించి చెప్పారో అప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుని ఆట కొనసాగించానని తెలిపాడు.
 
బిగ్ బాస్ షోలో గెలిచిన రూ.50 లక్షల ప్రైజ్ మనీని కేన్సర్‌తో బాధపడే తల్లులని కాపాడడానికి వినియోగించనున్నాను. డబ్బు చేతికి రాగానే పనులు  మొదలుపెడతాను. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ పేరుతో మరో వారం రోజుల్లో వెబ్‌సైట్ ప్రారంభించి, సేవా కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే అత్యుత్తమ సేవా సంస్థగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. తన షెడ్యూల్ మొత్తం ఈ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తానన్నాడు. 
 
అభిమానులు ఎప్పుడు కలవాలని అనుకున్న ఆ షెడ్యూల్‌ని బట్టి కలవొచ్చు. అలానే తాను బిగ్ బాస్ హౌస్ లో ధరించిన బట్టలను ఈ వెబ్ సైట్ ద్వారా వేలం వేసి దాని ద్వారా వచ్చే డబ్బుని సేవా కార్యక్రమాలకి వినియోగించనున్నానని  కౌశల్ చెప్పుకొచ్చారు. అలానే కౌశల్ ఆర్మీని పెయిడ్ ఆర్మీ అని కొందరు అంటున్నారని పెయిడ్ ఆర్మీ అని నిరూపించలేకపోతే అభిమానులకి బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నాడు. 
 
మరోవైపు.. బిగ్ బాస్ సీజన్-2 విజేతగా నిలిచిన కౌశల్ ఈ రియాల్టీ షో ద్వారా భారీ ఓట్లు సంపాదించుకున్నాడు. దీంతో బయట అతడి క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ సీజన్-1లో విజేతగా నిలిచిన శివబాలాజీకి బిగ్ బాస్ కారణంగా పెద్దగా క్రేజ్ ఏం రాలేదనే చెప్పాలి. కౌశల్ విషయంలో మాత్రం అలా జరగలేదు. 
 
బిగ్ బాస్ సీజన్-2తో ఈ మోడల్ కమ్ యాక్టర్‌కి అన్ని విధాల లాభాలే కలుగుతున్నాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న చాలా ఈవెంట్స్‌కి కౌశల్‌ని అతిథిగా పిలుస్తున్నారు. అంతేకాదు తన మోడలింగ్ ఏజెన్సీకి వచ్చే కాంట్రాక్ట్స్ కూడా బాగా పెరిగాయట. ఇలా ర్యాంప్ వాక్ చేసేందుకు... అతిథిగా ఆకట్టుకునేందుకు కౌశల్ రెండు విధాలుగా ఛార్జ్ చేస్తున్నాడని.. అతనికున్న క్రేజ్‌తో నిర్వాహకులు కూడా భారీ మొత్తాన్ని ఇచ్చేందుకు వెనుకడుగు వేయట్లేదని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఇకపోతే.. ప్రస్తుతానికి గోవాలో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్‌ని కౌశల్ ఏర్పాటు చేస్తున్నాడట. దానికి కారణం అతడి కంపెనీకి కోస్టల్ సిటీల నుండి కాంట్రాక్ట్‌లు వస్తుండడంతో ప్రత్యేకంగా ఈ మీట్‌ని ఏర్పాటు చేస్తున్నాడట. మొత్తానికి బిగ్ బాస్ షోతో కౌశల్‌‌కి మంచి లాభమే జరిగిందని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షిండే రాజీనామా : మహారాష్ట్ర కొత్త సీఎంగా ఫడ్నవిస్‌కే ఛాన్స్ : అజిత్ పవార్

11 గంటలు ఆలస్యంగా భోపాల్ - నిజాముద్దీన్ వందే భారత్ రైలు

యూజీ నీట్ ప్రవేశ పరీక్షా విధానంలో కీలక మార్పు?

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments